ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం రాజకీయ వివాదాలకు కేంద్రం అవుతోంది. ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పెంచాలని ఏపీ ప్రభుత్వం .. కేంద్రానికి లేఖ రాసింది.ఆయన సేవలు ప్రస్తుతం చాలా అవసరం అని చెబుతోంది. అదే సమయంలో ఆదిత్యనాథ్ దాస్ కు పొడిగింపు ఇవ్వవొద్దని తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. డీవోపీటీకి లేఖ రాశారు. అందులో ఆదిత్యనాథ్ దాస్ .. సీఎస్‌గా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మాత్రమే కాదు… జగన్ కేసులో నిందితుడిగా ఉన్నారని.. ఆ కేసుల్లో క్విడ్ ప్రో కో కింద లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న ఇండియా సిమెంట్స్ సంస్థకు.. సీఎస్‌గా మరిన్ని మేళ్లు చేశారని.. ఆరోపిస్తూ.. లేఖకు ఆధారాలు జత చేశారు.
సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ను కొనసాగిస్తే.. ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని.. ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు డీవోపీటికి ఫిర్యాదులు అందడంతో… కేంద్రం .. ఆదిత్యనాథ్ దాస్‌కు పొడిగింపు ఇస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉంటే.. పొడిగింపు లభిస్తోంది. చంద్రబాబు హయాంలో… ఎవరికీ పెద్దగా పొడిగింపులు ఇవ్వలేదు. అయితే ఇటీవల కరోనా కారణంగా కీలక అధికారులు మధ్యలో రిటైరైతే.. తదుపరి చర్యలకు ఇబ్బందికరం అన్న అభిప్రాయాలు వినిపించడంతో రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు పదవీ కాలం పొడిగిస్తున్నారు.
గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే పొడిగింపు లభిస్తోంది. అయితే సాధారణంగా.. సీఎస్ల పదవీ కాలం పొడిగింపు అనేది ప్రభుత్వాలకు సంబంధించినదే అయి ఉంటుంది. ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసేది తక్కువే. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డీవోపీటీకి … బెంగాల్ సీఎస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం … ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.