తక్షణం ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 కింద రాష్ట్రపతి పాలన విధించాలని.. టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం రాజధాని ఒక్కటే కాదు.. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వ ఆదాయం… రూ. పది వేల కోట్లకుపైగా పడిపోవడం కూడా అని చెబుతున్నారు యనమల రామకృష్ణుడు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ .. పతనమైపోయిందని.. ఇది ఏపీని మరో వెనిజులాలా మార్చే పరిస్థితి ఉందని.. టీడీపీ వర్గాలు కొన్ని రోజుల నుంచి చెబుతున్నాయి. గత ఎనిమిది నెలల ఆదాయ.. వ్యయాల లెక్కలు బయటకు రావడంతో.. యనమల .. తన ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుభవాన్నంతటికి బయటకు తీశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లో రూ. 45వేల కోట్లు అప్పులు చేసింది. ఈ అప్పుల్లో.. పెట్టుబడి వ్యయం.. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించింది.. సున్నా. మొత్తం పంచుడు పథకాలకే పెట్టారు. చాలా వరకూ.. జీతాలు, పెన్షన్లను కూడా అప్పులతోనే లాక్కొస్తున్నారు. ఇదే విషయాన్ని యనమల స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260కోట్లు ఉంటే, 8నెలల్లోనే రూ.35వేల కోట్ల అప్పులు చేసి… దాదాపుగా దివాలా తీయించేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోవడం వల్ల యువత ఉపాధి అవకాశాలను పోగొట్టారంటున్నారు.
రాజకీయ అస్థిరత కారణం కావొచ్చు..విభజన అనంతరం.. ఏపీ నిలబడటానికి అవసరమైన పునాదుల్ని తాము వేస్తే.. వైసీపీ ధ్వంసం చేసిందన్న ఆవేదన కావొచ్చు.. టీడీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. జగన్ ప్రభుత్వం… ఉంటే.. ఏపీ సర్వనాశనం అవుతుంందని భావిస్తున్నారు. అందుకే.. బర్తరఫ్ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. అయితే.. దీనికి ఒక్క శాతం కూడా చాన్స్ లేదనేది.. రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం.