పేదలందరికి కుటుంబానికి రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడింది.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు..లాక్ డౌన్ అంశాలపై చర్చించేందుకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం అయింది.లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని.. టీడీపీ పొలిట్‌బ్యూరో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది. కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలిని డిమాండ్ చేశారు. ప్రజలు ఉపాధి కోల్పోయినా… అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని టీడీపీ మండిపడింది.కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు.. రూ.50 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేసింది.
ప్రజల కరెంట్, నీటి బిల్లులను రద్దు చేయాలని .. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని డిమాండ్ చేసిది. అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని సూచించింది. రైతుల సమస్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా చర్చించింది. సీఎం అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని … ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తక్షణం రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రైతులు పంటను రవాణా చేసుకోలేక… అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసింది. చంద్రబాబు ముందు చూపుతో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని పొలిట్ బ్యూరో అభినందించింది.
ఓ వైపు…వైసీపీ నేతలు.. జాతీయ విపత్తు సమయంలోనూ.. విమర్శలు చేస్తున్నారని..చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయినా… ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాల్సిందేనని టీడీపీ.. నిర్ణయించుకుంది. ప్రజల కోసం చేసేదే రాజకీయమని..వారికి కష్టాలొచ్చినప్పుడు..ప్రభుత్వం వైపు నుంచి పని చేసేలా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ నేతలంటున్నారు.