అనుమానంగా చూస్తున్నారని ఎన్నికల సంఘం సిగ్గుపడినట్లుగా ఉంది. వన్ సైడ్‌గా వెళ్తున్నారని.. అందరూ అనుకుంటున్నారని.. తాను కూడా.. ఫీలైనట్లుగా ఉంది. వ్యవస్థ మొత్తాన్ని వైసీపీ కోసం.. బీజేపీ కోసం వాడుతున్నారన్న ఆరోపణలు వస్తూండటంతో… ఇక తట్టుకోలేకపోయినట్లు ఉన్నారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదును అప్పటికప్పుడు పరిశీలించి రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తారట..!
టీడీపీ ఫిర్యాదులపై కూడా విచారణ చేస్తున్నామని చెప్పుకోవడానికా..?
తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇప్పటి వరకూ.. 160 ఫిర్యాదులతో.. ఈసీ వద్దకు వెళ్లినా.. ఒక్కటంటే.. ఒక్కదానిపై.. కనీసం పరిశీలన, వివరణ కూడా అడగని ఈసీ… శుక్రవారం.. వెళ్లి.. పందొమ్మిది పోలింగ్ బూత్‌లలో.. రీపోలింగ్ జరిపించాలని… వినతి పత్రం ఇస్తే.. వెంటనే స్పందించింది. అధికారుల నుంచి వివరాలు తీసుకుని… టీడీపీ నేతలను సంతృప్తి పరచడానికా.. అన్నట్లు.. రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెడతామని… సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా.. టీడీపీ నేతలు.. చెవిరెడ్డి చేసినట్లు… మొదటగా సీఎస్‌కు వినతి పత్రం అందించారు. చెవిరెడ్డికి చేసినట్లుగా.. సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో వెంటనే ఎల్వీకి…అలా సిఫార్సు చేయక తప్పలేదు. సీఎస్ సిఫార్సు మేరకు.. సీఈవో వెంటనే… కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని… రెండు పోలింగ్ బూత్‌లలో… రీపోలింగ్ కు ప్రతిపాదనలు పంపారు.
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న సీఎస్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు..?
అసలు… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి… ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం లేదు. అలా జోక్యం చేసుకుంటే.. విధుల నుంచి తొలగిస్తారు. బెంగాల్ లో అదే జరిగింది. ముగ్గురికిపైగా ఉన్నతాధికారులను.. ఈసీ ఉన్న పళంగా బదిలీ చేసింది. వారు చెప్పిన కారణం ఏమిటంటే.. ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడం. ఏపీలో సీఎస్ మాత్రం.. ఏకంగా సీఈవో విధుల్నే నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ సిఫార్సుల దగ్గర్నుంచి కౌంటింగ్ ఏర్పాట్ల వరకూ.. అన్నింటినీ సమీక్షించేస్తున్నారు. అయినా ఈసీ ప్రొత్సహిస్తోంది కానీ పట్టించుకోవడం లేదు… అంటే… బెంగాల్లో అధికారులు మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న ఆలోచనతో బదిలీ చేసింది. ఏపీలో మాత్రం.. అధికారులు.. బీజేపీ మిత్రపక్షం వైసీపీకి అండగా ఉంటున్నారు కాబట్టి లైట్ తీసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రీపోలింగ్ పెట్టడానికి లంచాలు కూడా తీసుకుంటున్నారా..?
లంచం తీసుకుని రీపోలింగ్‌కు ఆదేశించారని.. టీడీపీ నేతలు.. నేరుగా… ఈసీ కార్యాలయంలో అధికారుల ఎదుటే ఆరోపణలు చేయడం… కలకలం రేపుతోంది. కేంద్ర హోంశాఖలో ఉండే ధర్మారెడ్డి అనే అధికారి.. ఎన్నికల సంఘం కార్యాలయానికి పదుల సార్లు వచ్చారని.. ఆయన ఈసీ అధికారులకు చేసిన ఫోన్ల కాల్ డేటాను.. బయటకు తీస్తే.. బేరాల సంగతి తేలిపోతుందని… టీడీపీ నేతలు.. ఈసీ కమిషనర్ల వాదించడం.. కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై.. ఈసీ కమిషనర్లు… ఖండించలేకపోయారు. వాగ్వాదంలో.. టీడీపీ నేతలను కూల్ చేయడానికి టీడీపీ అడిగిన రెండు చోట్ల రీపోలింగ్ పెడతామని సర్ది చెప్పి పంపేశారు. మొత్తానికి.. ఎన్నికల నిర్వహణ చివరి దశకు వచ్చిన తర్వాత కూడా ఈసీ… తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందనే స్పష్టవుతోంది.