ప్రజాస్వామ్యంలో సీఎం ఒక్కరే పాలకుడుకాదు. ఆయన నేతృత్వంలో అందరూ పని చేయాల్సిందే. కానీ కొంత మంది మాత్రం.. తప్పనిసరిగా పదవుల్ని ఇతరులకు పంచినా అధికారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఉంటారు. వారిని డమ్మీలుగా చేసి.. తామే పాలన చేస్తూంటారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో అదే జరిగింది. ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా స్వచ్చందంగా.. స్వేచ్చగా పని చేయలేరు. కానీ నేడు ప్రతీ మంత్రి ఫీల్డ్ లో ప్రజల కోసం పని చేస్తున్నారు.
మంత్రులంతా హైపర్ యాక్టివ్
మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండి పూడ్చేందుకు మూడు రోజుల పాటు గట్టుపైనే ఉన్నారు. నారా లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పని చేశారు ఇతర మంత్రులంతా వరద సహాయ చర్యల్లో ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి కీలకమైన విషయాల్లో మంత్రులు .. యాక్టివ్ గా సమవేశాలకు హాజరయ్యారు. పరిశ్రమల మంత్రి భరత్ కీలక పెట్టుబడుల పర్యటనలు చేశారు. ఇాలా అందరూ .. తమ తమ విధులకు సంబంధించి పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.
వైసీపీ హయాంలో మంత్రులు డమ్మీలు
వైసీపీ ప్రభుత్వంలో రెండు విడుతలుగా మంత్రులు వచ్చారు. పది మంది డిప్యూటీసీఎంలు ఉన్నారు. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరైనా గుర్తుంచుకునే పని చేయగలిగారా ?. చేయలేదు ఎందుకంటే వారితో పని చేయిచుకోలేదు. ఎంత రాజకీయాల్లో తలపండిన వారికైనా డిప్యూటీ సీఎంలు ఎవరెవరో గుర్తుండదు. ఎవరూ వారి వారి శాఖలపై కనీస సమీక్ష నిర్వహించడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా చెప్పాలంటే అంతా ఒకరే చేసేస్తారు.. నియోజకవర్గాల్లోనే ఉండాలి ఆ ఒకరు మంత్రులకు సూచిస్తారు. అంటే పేరుకే మంత్రులు… అంతా చేసిది ఒకరు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకున్న ప్రజలు
వైసీపీ కాలంలో ఉన్న డమ్మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ మాత్రం సహించలేపోయారు. ఒక్క మంత్రి తప్ప అందరూ ఓడిపోయారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరూ పని చేయాలి కానీ… పాలన కాకుండా సెటిల్మెంట్లు చేస్తామని .. డిసైడైపోతే.. ప్రజలు కూడా డిసైడవుతారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే వారిని ఇంటికి పంపుతారు.