వైసీపీ హయాంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రతిపక్షాన్ని వేధించడమే తమ విధిగా పెట్టుకున్నారు. పాలకులకు దోచి పెట్టడమే పనిగా చేశారు. ఇలాంటి అధికారులకు ఇప్పుడు ఉక్కపోత ప్రారంభమయింది. అయితే వారి సీనియారిటీ.. తాము జగన్ రెడ్డి చెప్పినట్లే చేశామని … తమను కూడా బెదిరించారని ఏదో ఒక కారణం చెప్పి ప్రస్తుత ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తప్పు చేసిన వాళ్లను శిక్షించాల్సిందేనన్నట్లుగా ప్రజాభిప్రాయం ఉండటంతో ప్రభుత్వ పెద్దలు జాలి చూపిస్తున్నా వారికి ఊరట లభించడం లేదు.
అధికారం చేపట్టిన తర్వాత కొంత మంది జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారుల్ని పక్కకు తప్పించారు. అయితే గోపాల కృష్ణ ద్వివేదీని మాత్రం గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిస్తూ అదనపు శాఖలు ఇచ్చారు. దీనిపై టీడీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. ఎందుకంటే వైసీపీ గనుల దోపిడికి ఆయన ప్రత్యక్షంగా సహకరించారు… అంతే కాదు ఎన్నో సార్లు కోర్టు ధిక్కరణ శిక్షలకు గురయ్యారు. అదే సమయంలో టీడీపీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో చంద్రబాబు ఆయన ఎదురుగా కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అలాంటి అధికారికి మళ్లీ ప్రాధన్యం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి.
ఇంత మంచితనం పనికి రాదని… మంచితనాన్ని చేతకాని తనం అనుకునే ప్రమాదం ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. గనుల శాఖ నుంచి ద్వివేదిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్మిక కర్మాగాల బాయిలర్ల శాఖ కార్యదర్శిగా మాత్రమే కొనసాగుతారు. నిజానికి ప్రధాన పోస్టుల కోసం సీనియార్టీ ఉన్న అధికారులంతా జగన్ చెప్పినట్లుగా చేసి నిండా మునిగిపోయారు. అయితే వారిలో కొంత మంది అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సీరియస్‌గా.. సిన్సియర్‌గా పని చేసిన వారే.