తెలుగుదేశం పార్టీ టార్గెట్ గా పెట్టుకున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనిగండ్ల రామును పోటీకి నిలబెట్టాలని చంద్రబాబునాయుడు దాదాపుగా డిసైడయ్యారు. ఇంత కాలం రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము మధ్య టిక్కెట్ కోసం పోరాటం నడుస్తోంది. చివరికి వెనిగండ్ల రాముకు టిక్కెట్ ఖరారు చేశారు. వెనిగండ్ల రాము ఎన్నారై. రాజకీయాలపై ఆసక్తితో టీడీపీ ఓడిపోయిన తర్వాత వచ్చి గుడివాడలో పని చేసుకుంటున్నారు.
గుడివాడలో టీడీపీ తరపున అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. రావి వెకంటేశ్వరరావు విడిగా కార్యక్రమాలు చేపట్టినా ఆయన మాత్రం అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నించేవారు. ఆయన భార్య ఎస్సీ క్రిస్టియన్ వర్గానికి చెందిన వారు. వెనిగండ్ల రాము మామ గుడివాడ క్రిస్టియన్ వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. చర్చిల్లో వెనిగండ్ల రాముకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌కు తోడు.. వైసీపీ ఓటు బ్యాంక్ అయిన దళితుల ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్, చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలతో …. గుడివాడలో అత్యంత బలంగా ఉండే కాపు వర్గాన్ని కొడాలి నాని దూరం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కూడా పొత్తు ఖరారు కావడంతో గుడివాడలో పాజిటివ్ ఫలితం వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. సుదీర్ఘంగా గడివాడ ఎమ్మెల్యేగా ఉంటున్న నాని కనీసం రోడ్లు కూడా వేయించలేదన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది. దీన్ని టీడీపీ క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.