పెనుమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు రెండు జాబితాల్లో బోడె ప్రసాద్ పేరును ప్రకటించలేదు. ఈ సారి టిక్కెట్ లేదని చెప్పించారు. ప్రత్యామ్యాయంగా చంద్రబాబు ఏదో ఒకటి చూస్తారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బోడె ప్రసాద్‌కు సమాచారం వెళ్లింది. పెనుమలూరు నుంచి దేవినేని ఉమ సహా అనేక పేర్లతో ఐవీఎర్ఎస్ సర్వేలు నిర్వహించారు. చివరిక బోడె ప్రసాద్ నే ఖరారు చేశారు.
బోడె ప్రసాద్.. వైసీపీలో ఉండి చంద్రబాబుపై బూతులు తిట్టే నేతలు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మిత్రుడు అన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకూదని అనుకున్నారని చెబుతున్నారు. అయితే వారిద్దరితో తన స్నేహాన్ని ఎప్పుడో తెంపేసుకున్నానని బోడె ప్రసాద్ చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ కలవలేదన్నారు. పెనమలూరు సీటును దేవినేని ఉమాకు ఇవ్వాలని అనుకున్నా సానుకూలత కనిపించలేదు. స్థానిక టీడీపీ శ్రేణులు బోడె ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. దేవినేని ఉమనే కొడాలి నానితో కానీ, వంశీతో కానీ ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పి తనను అడ్డుకోవాలని కుట్రలు పన్నినట్టు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ గొడవలతో సానుభూతి కూడా పెరగడంతో చంద్రబాబు ఆయనకే టిక్కెట్ కేటాయించారు.
బోడె ప్రసాద్ పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో సామాన్యుడిగా తిరుగుతూ ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బైక్ మీద వెళ్లి తప్పు చేసి ఉంటే క్షమించాలని ప్రజల్ని అడిగారు. సైకిల్ మీద, బుల్లెట్ మీద ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలను కలవడం పలకరించడం వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం, సమస్యల పరిష్కారనికి పని చేయడం అతని ప్రత్యేకత. ఇవన్నీ కలసి వచ్చాయని అనుకోవచ్చు.