పై స్థాయిలో మాట్లాడుకుని పొత్తులు పెట్టుకుంటే సరిపోదు.. ఓట్ల బదిలీ జరగాలంటే కింది స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం ఉండాలి… ఈ విషయాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే గుర్తించాయి. పొత్తు ప్రకటన చేసిన వెంటనే ఆ పార్టీల నాయకత్వాలు… కింది స్థాయి వరకూ కలసిపోయే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు మొదట ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత నియోజకవర్గ .. మండల, గ్రామ స్థాయిలో పార్టీల నేతలు క లిసి పని చేసుకునే వాతావణాన్ని ఏర్పాట్లు చేసుకునే చాన్స్ ఉంది.
ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొందడం అంటే… తమ ఓటర్లను.. తమకు ఓటు వేసే వాళ్లను పోలింగ్ బూత్ వరకూ వచ్చేలా చేసుకోవడం. ఇది ఎలక్షనీరింగ్. ఇలాంటి విషయాల్లో సక్సెస్ కావాలంటే కింది స్థాయి వరకూ పార్టీ నిర్మాణం ఉండాలి. జనసేన పార్టీకి ఇలాంటి నిర్మాణం లేదు. అందుకే గత ఎన్నికల్లో ఫ్యాన్స్ తో కూడా ఓటు వేయించుకోలేకపోయారు. ఫలితంగా ఆరు శాతం ఓట్లకే పరిమితమయ్యారు. స్వచ్చంగా తిరుగులేని అభిమానం ఉన్న వారు మాత్రమే ఓటు వేశార.. కానీ రాజకీయం అంటే… తమ ఓటు పక్కకుపోకుండా చూసుకోవడం కూడా కీలకమే.
వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా.. టీడీపీ, జనసేన పొత్తులు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా… ఓట్ల బదిలీ జరగడానికి సమన్వయ సమావేశాలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని సీరియస్గా నిర్వహిస్తున్నారు. ఇలాంటి గ్రౌండ్ వర్క్ పకడ్బందీగా చేస్తే.. అద్భుత ఫలితాలు వస్తాయని.. టీడీపీ, జనసేన నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.