రాజకీయాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ట్రెండ్ ను బట్టిన అర్థం చేసుకోవచ్చు. ఓ పార్టీ వారి గురించి కాకుండా… పక్క పార్టీ గురించే ప్రచాం చేస్తూ వస్తే… అంతకు మించిన ట్రెండింగ్ టాపిక్ ఏమీ ఉండదు. ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ముందే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో అదే జరిగింది. బీఆర్ఎస్ .. కాంగ్రెస్ కోసమే ప్రచారం చేసింది. ఆ పార్టీ వస్తే అదయిపోతుంది.. ఇదయిపోతుంది అని ప్రచారం చేసింది. దీంతో ఆ పార్టీనే ప్రజల మైండ్ లో రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. టీడీపీ, జనసేన గురించి వైసీపీ ఎక్కువ ప్రచారం చేస్తోంది.
చంద్రబాబునాయుడు , పవన్ కల్యాణ్ టిక్కెట్ల ప్రకటన చేసినప్పటి నుండి మీడియా, సోషల్ మీడియాలో మొత్తం ఆ కూటమి గురించే చర్చలు నడుస్తున్నాయి. నీలి, కూలి మీడియాలోనూ అదే తంతు. మొత్తం స్పేస్ ఆ పార్టీలకే కేటాయిస్తున్నారు. జగన్ రెడ్డి కుప్పానికి నీళ్లిచ్చానని అక్కడకు పోయి ఓ బటన్ నొక్కినా పట్టించుకోలేదు. ఇక సోషల్ మీడియా మొత్తం టీడీపీ, జనసేన కూటమికి ఎంత మైలేజ్ తేవాలో అంతా తెలుస్తోంది. రాజకీయాల్లో నెగెటివ్ పబ్లిసిటీ ఎంత ప్లస్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. తాను టీడీపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని అనుకుంటున్నారు… కానీ ఆ కూటమికి వారు ఆయాచిత పబ్లిసిటీ కల్పిస్తున్నారు.. రెండు, మూడు నియోజకవర్గాల జనసేన నతలతో సాక్షి మీడియా డ్రామాలు వేయిస్తూ.. చేయిస్తున్న స్కిట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
నీలి, కూలీ మీడియాతో పాటు.. వైసీపీ సోషల్ మీడియా కూడా .. తమకు ఎంతో పబ్లిసిటీ ఇవ్వడాన్ని కూటమి ఎంజాయ్ చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకూ ఇదే పరిస్థితి ఉండేలా ఒకటి తర్వాత ఒకటి వ్యూహాన్ని అమలు చేయనున్నారు. వైసీపీ ప్రస్తావన ఓ పది శాతం… టీడీపీ, జనసేన ప్రస్తావన 90 శాతం ప్రజల్లో ఉండేలా చూసుకుంటున్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాలోనూ టీడీపీ, జనసేనకే పబ్లిసిటీ వచ్చేలా రాజకీయ వ్యూహాలు అమలు చేయనున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి… స్పీచ్ లన్నీ.. కూటమి చుట్టూనే తిరుగుతున్నాయి.