కొడాలి నాని భాష గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. అంత దారుణంగా ఇతరుల్ని .. వారి కుటుంబసభ్యుల్ని తిడుతున్న ఆయన వైఖరి చర్చనీయాంశమవుతోంది. ఆయనను కంట్రోల్ చేయని వైసీపీ తీరూ ప్రశ్నార్థంకంగా కనిపిస్తోంది. అయితే ఆయనను ఎవరైనా ఒక్క మాట అంటే అరగంటలో అరెస్ట్ చేసేందుకు పోలీస్ యంత్రాంగం రెడీగా ఉంది. విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఉదయం ప్రెస్మీట్ పెట్టి కొడాలి నాని అభ్యంతరకర భాషపై మండిపడ్డారు. తాము కూడా అంత కన్నా ఎక్కువగా తిట్టగమని ఆయన కూడా కొడాలి నాని భాష వాడారు.
అయితే ఏపీలో అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం కొడాలి నాని తిట్టొచ్చు కానీ.. ఆయనను తిడితే తక్షణం అరెస్ట్ చేస్తామని పోలీసులు రంగంలోకి దిగిపోయారు. వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని.. ఆయన ఇంటిని వందల మంది పోలీసులతో చుట్టు ముట్టారు. పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. అయితే 41 ఏ కింద నోటీసులు ఇవ్వకుండా తాను పోలీస్ స్టేషన్కు ఎలా వస్తానని ఆయన ప్రశ్నించారు. స్టేషన్కు వస్తే … అక్కడే ఇస్తామని పోలీసులు చెప్పారు. అయితే బుద్దా వెంకన్న మాత్రం దానికి అంగీకరించలేదు.
తర్వాత పోలీసులు ాయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరు చూసి.. ఏపీలో వైసీపీ నేతలు ఎవరినైనా తిట్టొచ్చు.. ఎవరినైనా కొట్టొచ్చు.. ఎవరినైనా చంపొచ్చు కానీ.. వారిని ఎవరైనా ఒక్క మాట అన్నా.. పోలీసులు చిన్న ఫిర్యాదు తీసుకుని వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారని ఈ ఘటన నిరూపించిందని టీడీపీ నేతలంటున్నారు. మొత్తంగా కొడాలి భాషను విన్న వారికి.. ఆయనను తిట్టారని బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడంపై మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అంతే అనుకుని నిట్టూరుస్తున్నారు.