తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనపై లోకాయుక్త ఆదేశంలో సీఐడీ కేసు నమోదు చేసినప్పుడే ఎప్పుడో ఓ అర్థరాత్రి అరెస్ట్ ఖాయమని టీడీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ముందస్తు బెయిల్ లాంటివి తీసుకోవడం కన్నా అరెస్టు చేసుకుంటేనే పోలీసుల తీరుపై ప్రజలకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని లైట్ తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో సీబీఐ సోదాలు చేసి కొంత మందిని అదుపులోకి తీసుకున్న సమయంలో టీడీపీ సోషల్ మీడియాకు పని పెట్టేలా అశోక్ బాబును అర్థరాత్రి అరెస్ట్ చేశారు.
అయితే టీడీపీ నేతలు ముందుగా ఊహించిందే కాబట్టి డైవర్ట్ కాలేదు. చంద్రబాబు, లోకేష్ ఖండించారు. నిజానికి ఆయనపై కేసు ఎప్పుడో క్లోజ్ అయింది. ఆయనపై అభియోగం క్లరికల్ మిస్టేక్ అని కిరణ్ కుమార్ హయాంలో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో అప్పటి ప్రభుత్వం విషయాన్ని క్లియర్ చేసింది. కానీ ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారని లోకాయక్త కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అసలు లోకాయుక్తకు ఉద్యోగుల సర్వీస్ అంశాలపై కేసు నమోదు చేయాలన్న ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందాలేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఇచ్చారు. సీఐడీ పోలీసులు అందుకే రెడీ ఉన్నారు.. కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు కొన్ని వందల మంది ఇలాంటి అరెస్టులను చూశారు.
న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి సీఐడీ పోలీసులకు ఎన్ని సార్లు ఎదురు దెబ్బలు తిన్నా వారు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అందుకే న్యాయపరమైన ఆప్షన్స్ వైపే టీడీపీ మొగ్గు చూపించింది. ఇలాంటి అరెస్టులు అలవాటయిటన్లుగా టీడీపీ నేతలు సోషల్ మీడియా పోస్టులు పెట్టి… మిగతా పనిని న్యాయపరంగా చేసుకుంటున్నారు. కానీ రాజకీయ అరెస్టుల విషయంలో ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటున్నారు.