మంత్రిగా ఉన్న పార్థసారధి కూడా వైసీపీ నుంచి వచ్చారు. ఎన్నికలకు ముందు ఆయనను చేర్చుకుని సీటిచ్చి మంత్రిని చేశారు. నూజివీడు లోకల్ నాయకుడు తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇవాళ ఆళ్ల నాని కూడా పార్టీలో చేరుతున్నారు. పెద్దగా వ్యతిరేకత లేదు. ఏలూరు లోకల్ లీడర్లే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారిపై లేని వ్యతిరేకత జోగి రమేష్ లాంటి వారిపై మాత్రం భగ్గుమంటోంది. వారు పార్టీలో చేరడం కాదు వారి నీడ పడినా సరే క్యాడర్ రగిలిపోతోంది. ఎందుకిలా?. వారు జగన్ను సంతృప్తి పరిచేందుకు ఉచ్చనీచాలు కూడా మరిచిపోవడం వల్లనే.
జగన్ సైకోయిజాన్ని సంతృప్తి పరిచేందుకు పోటీ పడిన కొంత మంది నేతలు
వైసీపీ హయాంలో ఎవరికైనా పదవులు రావాలన్నా.. పదవులు కావాలన్నా ఒకటే ప్రామాణికంగా తీసుకునేవారు. అదేమిటంటే ప్రతిపక్ష నేతల్ని తిట్టడం. కుటుంబాలకు రంకులు అంటగట్టడం. దాడులు చేయడం. ఇలాంటి వాటిల్లో జగన్ ను మెప్పిస్తే పదవి ఖాయం. జోగి రమేష్ లాంటి వాళ్లు పదవుల్ని అలాగే సంపాదించుకున్నారు. అలా చేయలేక చాలా మంది పదవులు పోగొట్టుకున్నారు. కొందరు తెచ్చుకోలేకపోయారు. జగన్ రెడ్డికి.. పార్టీకి ఎంత ఊడిగం చేసినా ఈ బూతురాయుళ్లకే ప్రాధాన్యం లభించింది.
ఇప్పుడు సీన్ రివర్స్
వారు జగన్ కోసం చేసిన పనులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే.. ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతే సాక్ష్యం. కొంత మంది వైసీపీ నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. కానీ వారి చేరికపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు క్యాడర్. కానీ జోగి రమేష్ ఉనికిని కూడా సహించలేకపోతున్నారు. ఆయన అయితే కూటమిలో ఏదో ఓ పార్టీలో చేరాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ ఆయనను చేర్చుకోవడం కాదు కదా.. దగ్గరకు కూడా తీసుకునే పరిస్థితి లేదని తేలిపోయింది. ఒక్క జోగి రమేష్ కాదు.. ఇలా నోరు పారేసుకున్న కనీసం ఇరవై మంది నేతలకు ఈ పరిస్థితి ఉంది. వారు తప్పించుకోవడం కష్టం.
వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి
చదువుల కోసం కక్కుర్తి పడ్డారు . రాజకీయాల్లో లేని సంస్కృతిని తీసుకు వచ్చారు. ఘోరమైన వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడువారిని క్షమించే పరిస్థితి లేదు. పై స్థాయి నేతలు.. వీళ్ల జోలికి వెళ్లడం కూడా స్థాయి తక్కువ అని వదిలేస్తారేమో కానీ.. క్యాడర్ మాత్రం అలా వదిలేసే చాన్స్ ఇవ్వడం లేదు. అధికారంకోసం.. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం వ్యక్తిగత శత్రుత్వాన్ని పెంచుకునేలా రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. భవిష్యత్ లో ఈ ఇరవైమంది నేతలు ఎన్నెన్ని కష్టాలు పడతారో ఊహించడం కష్టం.