ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఇప్పుడు మహర్షి సినిమా తెగ నచ్చేసింది. అందులో చెప్పిన వీకెండ్ వ్యవసాయమో… లేకపోతే.. రైతులను ఆదుకునే కాన్సెప్ట్ ఉండటమో .. వారికి తెగ నచ్చడానికి కారణం కాదు. అందులో ఉన్న ఓ డైలాగ్… టీడీపీ నేతల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అది తమకు అన్వయించుకుంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా.. చెప్పారు.
మహర్షి డైలాగ్‌కు టీడీపీకి లింకేంటి..?
మంగళవారం.. .తెలుగుదేశం పార్టీ అధినేత… చంద్రబాబు… అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమయంలో.. అనేక అంశాలపై చర్చలు జరిగాయి. మాటల మధ్యలో.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు… చంద్రబాబుతో ఓ మాట అన్నారు. మహర్షి సినిమాలో… ఓ డైలాగ్‌ను చెప్పి.. ఇప్పుడు.. దాన్ని టీడీపీకి అన్వయించి సోషల్ మీడియాలో.. ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాంతో టీడీపీ నేతలంతా.. ఒక్కసారిగా నవ్వేశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటంటే.. సినిమా క్లైమాక్స్‌లో.. విలన్… ” ఈ ఒక్క ఊరిని వదిలేసి ఉంటే…బాగుండేదని ” అంటాడు. దానికి కారణం… అప్పటికే ఊళ్లన్నీ.. ఆ విలన్.. గుప్పిట్లో ఉంటాయి. ఆ ఊరిని కూడా అలాగే చేద్దామనుకుంటే… మహేష్ బాబు రంగంలోకి దిగుతాడు. దాంతో.. ఆ విలన్ చరిత్ర తిరగబడుతుంది. అందుకే.. ” ఈ ఒక్క ఊరిని వదిలేసి ఉంటే…బాగుండేదని ” అంటాడు.
ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు అదే చెబుతారా..?
ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా… టీడీపీ విషయంలో ఇదే అనుకుంటున్నారని.. . సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో… బీజేపీ అతి తక్కువగా ఊహించడం వల్ల… చంద్రబాబు.. ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా.. దేశవ్యాప్తంగా విపక్షాలన్నింటినీ ఏకం చేశారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో ఇప్పుడు.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి వారు అన్నట్లుగా ఉన్న మోడీ వ్యతిరేక నాయకులు.. చంద్రబాబు నాయకత్వంలో ఒక్కటిగా పని చేసే సూచనలు కనిపిస్తూండటమే … మహర్షి డైలాగ్ కు.. టీడీపీకి అన్వయించడానికి కారణం అవుతోంది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఫలితాల తర్వాత బీజేపీ నేతలు ఒక్క టీడీపీని వదిలేసి ఉంటే బాగుండేదన్న చర్చ వస్తుందని టీడీపీ నేతలంటున్నారు.
మోడీ ప్రధాని కాలేకపోతే … కరెక్టే..!
నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ నుంచి బలవంతంగా పంపేసినంత పని చేసింది బీజేపీ. ముఖ్యమంత్రికి కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారు. అదే విజయసాయిరెడ్డి.. అదే పనిగా.. పీఎంవో కూర్చునే అవకాశం ఇచ్చారు. ఓ రకంగా విజయసాయిరెడ్డి.. పీఎంవో ద్వారా ఆన్ని పనులు చక్కబెట్టారు. ఏపీకి రావాల్సినవి రాకుండా అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు బయటకు వచ్చి..మోడీపై పోరాటం ప్రారంభించారు. మోడీ మళ్లీ ప్రధాని కాకుండా చేస్తానని శపథం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అదే జరిగితే.. చంద్రబాబు సక్సెస్ అయినట్లే..!