టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వ్యవహారంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. ఈ నెల 24న ఢిల్లీ ధర్నా చేస్తానని జగన్ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read : మొత్తానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే జగన్ ఫిక్స్ అయ్యారా?
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో ఎంపీలతో భేటీ అయ్యారు. ఎంపీలు పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలి..? రాష్ట్రం కోసం నిధులు ఎలా రాబట్టాలి..? మాట్లాడేందుకు వచ్చిన సమయాన్ని రాష్ట్రాభివృద్ది కోసం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే జగన్ టాపిక్ చర్చకు వచ్చింది.
Also Read : రాష్ట్రపతి పాలనకు డిమాండ్.. గతాన్ని తవ్వితీసుకున్న జగన్!
జగన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని..వైసీపీ గురించి ఆలోచించడం అంటే టైంను వృధా చేసుకోవడమేనని జగన్ ధర్నాను కొట్టిపారేశారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడు అనేది ముఖ్యం కాదని..రాష్ట్రాభివృద్ది కోసం ఏం చేస్తున్నాం అనే దానిపై ఎంపీలు ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. జగన్ అంశాన్ని పట్టించుకోవద్దని.. అందరి దృష్టి రాష్ట్రంపై పెట్టాలని స్పష్టం చేశారు.