వివేకా హత్య కేసులో తప్పు చేయాలని తాను ప్రమాణం చేస్తానని.. జగన్ ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని ఎన్నికల ప్రచారంలో లోకేష్ సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వస్తున్న పధ్నాలుగో తేదీనే డేట్ ఫిక్స్ చేశారు. వెంకన్న సన్నిధిలో ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు. అయితే టీడీపీ నేతలు ఇలాంటి సవాళ్లు చేస్తున్నారు.. ప్రమాణాలకు సిద్ధమా అని .. చాలెంజ్ చేస్తున్నారు కానీ.. స్పందించే వారు అతి తక్కువ. సీఎం జగన్ కానీ.. ఆయన పార్టీ నేతలు కానీ.. ప్ర్సతుతం వివేకా హత్యపై స్పందించే పరిస్థితి లేదు. అదుకే.. టీడీపీ నేతలు..లోకేష్ సవాల్‌గా కోరస్ డిమాండ్లు వినిపించడం ప్రారంభించారు.
సీనియర్ నేతలంతా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ… రకరకాల పేర్లతో పిలుస్తూ.. లోకేష్ సవాల్‌ను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే…తప్పు చేసినట్లుగా అంగీకరించినట్లేనని అచ్చెన్ాయుడు లాంటి నేతలు లాజిక్‌లు చెబుతున్నారు. అయితే వైసీపీ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. వివేకా హత్య కేసు అంశంపై వైసీపీ నేతలు అందరికీ మాట్లాడే చాన్స్ ఇవ్వలేదు. చాలా కొద్ది మందికి మాత్రమే.. అదీ కూడా..దర్యాప్తు కేంద్రం పరిధిలో ఉదన్న వాదన మాత్రమే వినిపించాలని ఆదేశించారు. అంతకు మించి ఎవరూ మాట్లాడటానికి అవకాశం లేదు.
అందుకే టీడీపీ నేతలు మరింతగా టీజ్ చేస్తున్నారు. ప్రమాణానికి రావాలంటూ సవాల్ చేస్తున్నారు. సవాల్‌కు స్పందిస్తే.. లోకేష్‌తో పాటు.. వివేకా హత్య కేసుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుంది. స్పందించకపోతే… వివేకా హత్య కేసు అంశాన్ని లైట్ తీసుకున్నారన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వైసీపీకి వస్తాయి. ఈ రెండింటిలో.. ఊరుకోవడమే ఉత్తమం అన్న ఫీలింగ్‌కు వైసీపీ నేతలు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అంటే… లోకేష్ సవాల్‌కు టీడీపీ నేతలు కోరస్ పాడినా… వినపడనట్లుగానే అధికార పార్టీ ఉండనుంది.