రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది.
నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.
రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది.