తెలుగుదేశంపార్టీ ఈ సారి మహానాడును కడపలో నిర్వహిచాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇందులో మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. విశేషమైన గెలుపు సాధించినందున.. రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కూటమి కడపలో ఏడు సీట్లలో కూటమి విజయం సాధించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే అతి పెద్ద విజయం. అందుకే ఈ సారి అక్కడ మహానాడును నిర్వహించాలని డిసైడయ్యారు. టీడీపీ మహానాడును ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప జిల్లా ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. ఒక్క సీటు గెల్చుకోవడమే టీడీపీకి గగనంగా మారింది. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత సెంటిమెంట్ ఊపులో జగన్ మంచి ఫలితాలు సాధించినా అధికారం అందిన తర్వాత ఆయన నిజ స్వరూపం బయటపడటంతో కుటుంబంలో కూడా చీలిక వచ్చింది. వివేకా హత్య కేసులో ప్రజల్లో పలుకుబడి కోల్పోయారు. చివరికి సొంత తల్లి, చెల్లికూడా దూరం కావడంతో ఆయనను నమ్మేవారు తగ్గిపోయారు.
కడపలో వైసీపీని మరింతగా దెబ్బకొడితే ఇక ఆ పార్టీ పునాదులు కదిలిపోతాయని అంచనా వేస్తున్నారు. అందుకే కడపలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల, కడపల్లో కూడా గెలిచేందుకు టీడీపీ ఈ మహానాడు వేదికగా ప్రణాళికలు సిద్దం చేసుకునే అవకాశం ఉంది.