ఖమ్మం అంటే ఆంధ్రా బోర్డర్ అని.. అక్కడ బహిరంగసభ నిర్వహించి తెలంగాణలో బలపడ్డామని చెప్పడం కాదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కాసాని జ్ఞానేశ్వర్ రెడీ అయ్యారు. ఈ సారి ఆయన నిజామాబాద్లో బహిరంగసభ పెట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఫిబ్రవరి మొదటివారంలో నిజామాబాద్ లోనూ భారీ పబ్లిక్ మీటింగ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం సభ కన్నా నిజామాబాద్ మీటింగ్ విజయవంతమవుతుందని కాసాని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. సంక్రాంతిలోపు కొత్త కమిటీ వేస్తామన్న ఆయన.. ఇతర పార్టీల నాయకులు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.
టీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల్లోనూ క్యాడర్ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీల ఓట్లను ప్రధానంగా ఆకట్టుకోవాలని టీ టీడీపీ ప్రయత్నిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తొలి టిక్కెట్ నాయి బ్రాహ్మణులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా 11 కులాల వారికి టిక్కెట్ ఇస్తామని చెప్పారు. బీసీలకే అత్యధిక టిక్కెట్లు కేటాయంచాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారు.
నిజామాబాద్లో కూడా టీడీపీకి సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. గతంలో అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత అక్కడ చాలా మంది పార్టీ మారిపోయారు. కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు కూడా బీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఆ పార్టీలో దక్కలేదు. ఇతర పార్టీల్లో ప్రాధాన్యం దక్కని కొంత మంది .. జూనియర్, యువ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.