టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ చేసిన ఆరోపణల కేసు తేలిపోయింది. తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని ఆ మహిళ నేరుగా హైకోర్టుకు వచ్చి చెప్పింది. దీంతో హైకోర్టు కూడా పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఈ వ్యవహారం ఇంత సింపుల్ గా తేలిపోవడంతో.. ఆవేశ పడిన వారందరికీ గట్టి షాక్ తగిలినట్లయింది.
హైదరాబాద్‌లో సత్యవేడు నియోజకవర్గానికి మహిళ ప్రెస్ మీట్ పెట్టి తమ ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే వేధిస్తున్నారని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మహిళ చేసిన ఆరోపణలతో టీడీపీ వెంటనే స్పందించింది. గంటలోపే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసు ఆమె పెట్టలేదు. కానీ స్టేట్ మెంట్ తీసుకున్నారు. కానీ వైద్య పరీక్షలకు ఆ మహిళ నిరాకరించింది. తర్వాత ఇప్పుడు అంతా మ్యూచువల్ కన్సెంట్ గానే జరిగిందన్నట్లుగా చెప్పి కేస్ విత్ డ్రా చేసుకున్నారు.
తనపై హనీట్రాప్‌కు పాల్పడ్డారని .. కేసును కొట్టి వేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. నిజానిజాలు విచారించకుండా కేసు పెట్టారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో హైకోర్టు పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మహిళతో వ్యవహారాన్ని ఆదిమూలం సెటిల్ చేసుకున్నారు. ఆ వీడియోల్లో ఎక్కడా బలవంతం చేసినట్లుగా లేకపోవడమే కాదు.. మొత్తంగా అసలేం జరిగిందో బయటకు తీశారని.. హనీ ట్రాప్‌గా తేలడంతో .. ఆ మహిళ.. ఆమెను ప్రోత్సహించిన వారు మరో మార్గం లేక రాజీకి వచ్చారని చిత్తూరు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ కేసు చాలా వేగంగా తేలిపోవడంతో తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని టీడీపీ హైకమాండ్ ను ఆదిమూలం కోరుతున్నారు