వైసీపీ ఎంఎల్ఎ రోజా దూషణల కారణంగా ప్రధానంగా వెలుగులోకి వచ్చిన తెలుగుదేశం ఎంఎల్ఎ అనిత ఇప్పుడు ప్రభుత్వంలో బాగా పట్టు పెంచుకున్నారని పాలకపక్ష సభ్యులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర సమయం దొరక్క తమలాటి సీనియర్లమే అవస్థలు పడుతుంటే యువ శాసనసభ్యురాలైన ఆమెకు ఆయనతో సహా నేతలందరూ చాలా ప్రాధాన్యత నిస్తున్నారని ఒక మాజీ మంత్రి మీడియాతో అన్నారు. అనిత పార్టీలో చాలా కాలంగా వుంటూ అంచెలంచెలుగా తన స్థానం బలోపేతం చేసుకున్నారని ఆయన విశ్లేషించారు. ఎంఎల్ఎ అయిన తర్వాతే వైవాహిక జీవితంలో కలతలు పెరిగి భర్తనుంచి విడాకులు తీసుకోవడం జరిగిందని అంతకు ముందు మాత్రం ఆమె ఎదుగుదలకు అతను బాగానే సహకరించేవాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ అగ్రనేతలు ఆమె మాటకు ఎక్కడ లేని విలువనిచ్చి సహకరిేస్తున్నారని, ముందు ముందు మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. ఆమెపై రోజా వ్యాఖ్యలు చాలా దారుణమైనవనవి వాటిని పదే పదే సభలో ఉటంకించడం చదివి వినిపించడం తనకే గౌరవం కాదని తెలుగుదేశంలో కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. మొన్నటి చర్చతోనైనా వాటి ప్రస్తావన ముగిసిపోతే బావుంటుందని ఆశిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్పై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని సిద్ధం చేసిన నాయకత్వం అనితను కూడా వారి స్థాయిలో మాట్లాడించడం బాగాలేదని ఎందుకంటే సభలో ఆమె జూనియర్ అన్నది గుర్తుంచుకోవాలనేది ఈ అసమ్మతి ఎంఎల్ఎల మాటగా వుంది.