కులం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గానే ఉంది. ఒకప్పుడు నేరుగా ఓ కులం పేరు పెట్టి చెప్పడానికి…సంకోచించేవారు. కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. కమ్మ సామాజివకర్గన్ని తీవ్ర స్థాయిలో అణచి వేస్తున్నారంటూ.. టీడీపీ ఎమ్మెల్యేలు… నేరుగా సీఎం జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఒకే సామాజికవర్గం చేతుల్లో పాలన ఉందని… టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. పోలీసు శాఖలో కేవలం కమ్మ సామాజికవర్గం అన్న కారణంగా 70మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆరోపించారు. కమ్మ జాతిలో పుట్టడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు.. జగన్ ఎందుకు అవకాశాలు కల్పించడం లేదని.. ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు స్కిల్స్ ఉండవని సీఎం భావిస్తున్నారని… ఎమ్మెల్యే బెందాళం అశోక్ విమర్శించారు.
ఈ కులాల రాజకీయంలో.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్టైల్ వేరుగా ఉంటుంది. అయన జగన్ ను మావాడు అంటూ కులం కోణంలో ఎప్పుడూ చెబుతూంటారు. ఏపీలో మొత్తం రెడ్డి రాజ్యం ఉందంటూ.. టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలను..జేసీ లైట్ తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులన్నింటినీ…రెడ్లకు ఇచ్చినందుకు జగన్ ను అభినందిస్తున్నానని… జేసీ ప్రకటించారు. జగన్ గట్స్ ను మెచ్చుకుంటున్నానన్నారు. అదే సమయంలో.. చంద్రబాబు.. కమ్మ వాళ్లను ప్రోత్సహించలేదని.. చెప్పారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని…తన సామాజివర్గానికి న్యాయం చేసే విషయంలో.. జగన్ కు ఉన్నంత గట్స్ చంద్రబాబుకు లేవని విశ్లేషించారు. నెల్లూరులో మాఫియా ఉందన్న ఆనం వ్యాఖ్యలపై.. జేసీ భిన్నంగా స్పందించారు. మాఫియా ఎక్కడ లేదో చెప్పాలన్నారు.
అసెంబ్లీలో సామాజిక న్యాయంపై ఓ ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి… నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు చట్టం చేశామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన పదవులనూ భర్తీచేస్తామని తుదిజాబితాను ఇదే శాసనసభలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇలాసామాజిక న్యాయం పాటిస్తూ చట్టంచేసిన అసెంబ్లీ మనదేనని జగన్ చెప్పుకొచ్చారు. మరో వైపు.. ఇలా పదవులు ఇచ్చినా సలహాదారులు.. ఇతర పేర్లతో.. తన సామాజికవర్గం వారిని తెచ్చి.. వారికి అధికారాలు లేకుండా చేస్తున్నారని.. రాజకీయవర్గాలు చాలా రోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్నాయి.