తెలుగుదేశం పార్టీకి .. ఆంధ్రప్రదేశ్‌లో.. రాజకీయ సవాళ్ల కన్నా.. వైసీపీ నేతలు పెడుతున్న కేసుల భయమే ఎక్కువగా ఉంది. ప్రతీ చిన్న దానికి కేసులు పెట్టి… పార్టీలు మారని ఒత్తిడి చేస్తున్నారు. వీటికి విరుగుడుగా.. టీడీపీ.. అమిత్ షాను చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఓ కారణం వెదుక్కుని ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. అమరావతిని దేశ పొలిటికల్ మ్యాప్‌లో పెట్టినందున కృతజ్ఞతలు చెప్పేందుకు అంటూ.. ఎంపీలు.. అమిత్ షా వద్దకు వెళ్లారు. తమకు ఎదురవుతున్న పరిస్థితుల్ని ఎకరువు పెట్టారు. విపక్ష పార్టీలపై పోలీసులను ప్రయోగించి.. చేస్తున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న కొంత మంది నేతల వివరాలనూ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై.. అమిత్ షా కూడా.. భరోసాగా స్పందించారని.. టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో.. చాలా ఫిర్యాదులు వచ్చాయని.. తనకు ఏం జరుగుతుందో.. మొత్తం తెలుసని.. తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లుగా ఎంపీలు చెబుతున్నారు. చేతిలో పోలీసు వ్యవస్థ ఉండటంతో.. వైసీపీ.. విపక్ష పార్టీలను.. చాలా హై రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. సోషల్ మీడియా పోస్టులను కూడా.. స్వేచ్చగా పెట్టుకోలేని పరిస్థితి విపక్ష పార్టీలకు ఉంది. ఇక గ్రామాలలో … వైసీపీ సానుభూతి పరుల దూకుడు..మామూలుగా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం అండగా ఉంటానని చెబుతోంది. న్యాయసాయం చేస్తోంది. కానీ పరిస్థితి… రాను రాను దిగజారిపోతోంది. అందుకే.. అమిత్ షా వద్దకు టీడీపీ ఎంపీలు వెళ్లినట్లు చెబుతున్నారు. అమిత్ షా భరోసా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి ఏపీలో శాంతిభద్రతలపై నేరుగా కల్పించుకోలేరు. కానీ.. పరోక్షంగా ఒక్క వార్నింగ్ ఐపీఎస్ అధికారులకు పంపితే.. మొత్తం సెట్ అవుతుందని.. టీడీపీ నేతలు నమ్ముతున్నారు.