అమరావతి వైసీపీ ఎమ్మెల్యేలకు… బంపర్ ఆఫర్ ప్రకటించింది టీడీపీ. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు రాజధాని కోసం రాజీనామా చేస్తే.. ఏకగ్రీవంగా గెలిపిస్తామని.. ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. ఆఫర్ను..మీడియా ద్వారా.. వైసీపీ ప్రజాప్రతినిధులకు పంపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సిద్ధం కావాలి … ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని ఇక్కడే ఉంటుందిని నక్కా ఆనంద్ బాబు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చరిత్రలో నిలిచిపోతారు.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడ మేం పోటీ పెట్టబోమన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఆఫర్లే ఇచ్చింది. అవన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని టీడీపీ నేతలు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బయటకు రాలేకపోతున్నారు. వచ్చిన అతి కొద్ది మంది.. రాజధానికి అనుకూలంగామాట్లాడుతున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రకటించారు.
ఎంపీ లావు కృష్ణదేవరాయులు కూడా.. అదే తరహా ప్రకటన చేశారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలన్నారు. రాజధాని అమరావతిలో ఉంటేనే… వారికి న్యాయం జరుగుతుందని.. వైసీపీ ఎమ్మెల్యేలు పరోక్షంగా చెబుతున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువై… ఉద్యమం తారస్థాయికి చేరుకుంటే..వారు కూడా..ఆలోచించకతప్పదేమో..?