కర్నూలు న్యాయరాజధాని అంటూ మభ్య పెట్టి చివరికి ఏమీ లేకుండా చేసిన వైసీపీపై కర్నూలు లాయర్లు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. పాదయాత్ర చేస్తూ కర్నూలుకు వచ్చిన నారా లోకేష్‌కు కర్నూలు న్యాయవాదులు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి లోకేష్‌కు సంఘిభావం తెలిపారు. ఈ సందర్భంగా లాయర్లతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. లాయర్లు తమ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్ ప్రతిపాదనపై చర్చించారు. నిజానికి బెంచ్ పెట్టడానికి ఎలాంటి సమస్యలు లేవని ప్రభుత్వం అనుకుంటే.. క్షణాల్లో అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం న్యాయరాజధానిగా ప్రకటించినప్పటికీ కర్నూలులో హైకోర్టు అని చెబుతోంది.. కానీ అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఉంటాయని చెబుతోంది. దీని వల్ల అసలు న్యాయ రాజధాని ఉద్దేశమే మారిపోతుంది. అదే సమయంలో న్యాయస్థానాల్లో కూడా న్యాయరాజధాని అనే అంశంపై స్పష్టత లేకుండా చేశారు. తమకు అలాంటి ఆలోచన లేదని కోర్టుల్లో చెప్పారు. దీంతో ప్రజల్ని మోసం చేసినట్లయింది. ఇప్పటికీ న్యాయరాజధాని వస్తుందని.. హైకోర్టు పెడతామని చెప్పడం లేదు. దీంతో ప్రజల్లో వైసీపీ మోసంపై క్లారిటీ వచ్చినట్లయింది.
ఇప్పుడు నారా లోకేష్ కర్నూలులో హైకోర్టు బెంచ్ పై హామీ ఇవ్వడంతో న్యాయవాదులు కూడా సంతృప్తి చెందారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అనే దానికి బీజేపీ కూడా గతంలో సపోర్ట్ చేసింది. టీడీపీ ఈ విషయంలో గుంభనంగా ఉంది. ఇప్పుడు సందర్భం వచ్చిందికాబట్టి బెంచ్ పెట్టడానికి పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపినట్లయింది.