వైఎస్ వివేకా హత్య కేసును… కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు… సీబీఐకి ఇవ్వాలని.. అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, ఆ పార్టీ నేతలు, వైఎస్ వివేకా కుటుంబసభ్యులు హైకోర్టులో వరుసగా పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. అవి అలా పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు.. ఆ బాధ్యత టీడీపీ తీసుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ డిమాండ్ ను పెద్దగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు… హైకోర్టులో పిటిషన్లు వేస్తోంది. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని టీడీపీ నేత ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ వేశారు.
వచ్చే మంగళవారం దీనిపై హైకోర్టులో జరగనుంది. వైఎస్ వివేకా హత్య కేసులో.. ప్రస్తుతం టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా నోటీసులు అందుకున్న వారిలో బీటెక్ రవి కూడా ఉన్నారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవి.. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పట్లో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ..జగన్, వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు ఇప్పుడు.. సీబీఐ విచారణ అవసరం లేదంటున్నారు.
జగన్ కూడా.. కడప ఎస్పీల్ని ఇద్దరు, ముగ్గుర్ని మార్చారు … కేసు లెక్క తేలకపోయినా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో.. టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు.. కొత్తగా పోలీసు అధికారులు టీడీపీ, బీజేపీ నేతలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తూండటంతో… వారు ముందు జాగ్రత్తగా సీబీఐ విచారణ కోరుతున్నారు. కోర్టు తీసుకునే నిర్ణయంపై అంతటా అసక్తి ఏర్పడుతోంది.