యువత ఇప్పుడు తమ రాజకీయ అభిప్రాయాల విషయంలో సోషల్ మీడియాతో ప్రభావితం అవుతున్నారు. అందుకే అన్ని పార్టీలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో సైన్యాన్ని మోహరించి చేయాల్సిన ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ఇది అసహ్యంగా మారిపోతోంది. అందుకే చంద్రబాబు పార్టీ విధానాలను ఓ ప ద్దతిగా ప్రజల్లోకి … యువతలోకి తీసుకెళ్లడానికి కొత్త కాన్సెట్ అమలు చేయాలని నిర్ణయించారు. అదే వెబ్ రేడియా.
వెబ్ రేడియోను డిజైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ వర్గాలు కసరత్తు చేశాయి. పార్టీకి సంబంధించిన నేతలు సాంకేతిక నిపుణుల ఇప్పటికే వెబ్ రేడియోపై వర్కవుట్ చేశారు. దీనికోసం కావాల్సిన ఫ్రీక్వెన్సీ అనుమతులు, ఇతర అంశాలను పార్టీ సాంకేతిక విభాగం చూసుకుంటోంది. వెబ్ రేడియో ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలను ప్రజల మదిలో నిలిచిపోయేలా వాటికి సంబంధించిన వీడియోలను అస్త్రాల రూపంలో సంధించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ అస్త్రాలను కూడా తెదేపా సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఈ వీడియోల ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంకోవైపు వెబ్ రేడియోను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఘటన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ఇదే సమయంలో చంద్రబాబు, నేతల స్పందన, జరుగుతున్న పరిణామాలు ఈ రేడియో కార్యక్రమాల ద్వారా వివరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయనుంది. ఇది ట్రెండ్ సెట్టర్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.