టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఏపీలో తోక జాడించిన అధికారులు ముఖ్యంగా సీఎస్ కు… కెరీర్లో కోలుకోలేని షాక్ ఇవ్వాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది.. అందుకే అనే అంచనాలున్నాయి. ఈ విషయం తెలుసుకుని.. కేబినెట్ భేటీ జరగకుండా ఉండేందుకు… సీఎస్ ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ ఇప్పటికే కౌంటర్ చేసేసింది. సీఈసీ దగ్గరే క్లారిటీ తీసుకుంది.
సీఈసీ నుంచి కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్..!
తెలుగుదేశం పార్టీ వర్గాలు కేబినెట్ సమావేశం ఏర్పాటుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలను అనధికారికంగా సంప్రదించాయి. కేంద్ర కేబినెట్ మాదిరిగా అత్యవసర పనులు, ప్రజోపయోగ కరమైన కార్యక్రమాలు ఉంటే కేబినెట్ ఏర్పాటు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వర్గాలు టీడీపీకి తెలిపాయి. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను తెలుగుదేశం నేతలు కలిశారు. ఆ తర్వాతే చంద్రబాబు.. పధ్నాలుగో తేదీకి కేబినెట్ భేటీని మార్చారు. కొంతమంది అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. తనను సీఎం పిలిస్తేనే వెళ్తానని చీఫ్ సెక్రటరీ చెప్తుండగా, పిలిచిన సమయంలో రాకపోవడంతో సీఎం అసంతృప్తిగా ఉన్నారు. పిలిచిన రోజు ఆర్థిక సంఘం సమావేశం ఉండటంతో తాను వెళ్లలేకపోయానని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరణ ఇస్తున్నారు. కానీ తర్వాతైనా వెళ్లి ఉండాల్సింది కదా.. అని టీడీపీ వర్గాలంటున్నాయి.
సీఎస్ చేతులు దాటిపోయిన పరిస్థితులు..!
సమీక్షలకు అధికారులను వెళ్లొద్దని తాను ఎవరికీ చెప్పలేదని.. చీఫ్ సెక్రటరీ అంటున్నారు. కొంతమంది అధికారులు మాత్రం సీఎస్ ఒత్తిడి వల్లే తాము సమీక్షకు వెళ్లడం లేదని నేరుగానే చెబుతున్నారు. కేబినెట భేటీలో ఎజెండా ఏమి ఉన్నా.. అధికారులు వ్యవహారిస్తున్న తీరు మంత్రులు ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడం, దీనికి ఎన్నికల కమిషన్ నిబంధనలను సాకుగా చూపడం వంటి అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. కేబినెట్ తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సీఎంను కాకా పట్టే ప్రయత్నాలు ప్రారంభించిన సీఎస్..!
సీఎస్.. ఇప్పటికే… ప్రొసీజర్ ప్రారంభించారు. మధ్యలో ఆపడానికి ఆయనకు కూడా చాన్స్ లేదు. కేబినెట్ భేటీకి ఇప్పటి పరిస్థితుల్లో సీఈసీ కూడా.. వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకటే వారు నాలుగు సార్లు మోడీ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చారు. కేంద్రంతో పోలిస్తే. ఏపీలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు సీఎస్ ముందస్తున్న కర్తవ్యం.. కేబినెట్ భేటీలో .. తనపై చర్యలు తీసుకోకుండా.. జాగ్రత్తలు తీసుకోవడం . అందుకే సీఎస్.. రెండు రోజులుగా.. చంద్రబాబే బాస్ అంటూ.. మాట్లాడుతూ.. కాస్త పరిస్థితిని తేలిక చేసే ప్రయత్నం చేస్తున్నారు.