పేదల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను… పక్కాగా ఉపయోగిచుకోవడానికి టీడీపీ సమయం తీసుకోవడం లేదు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించినప్పటికీ.. మారిన పరిస్థితులతో… అంత అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని.. రంగంలోకి దిగాల్సిందేనని డిసైడయ్యారు. శుక్రవారం నుంచే రోడ్ల మీదకు వచ్చే కార్యచరణ పెట్టుకున్నారు. మొదటగా.. అన్న క్యాంటీన్ల ఇష్యూతో… ఆందోళనలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా.. అన్న క్యాంటీన్ల వద్ద ఆందోళనలు చేశారు. వ్యూహాత్మకంగా… పలు చోట్ల… వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున పేదల ఆకలి తీర్చారు. దాంతో.. వారంతా.. మీడియా ముందు… అన్న క్యాంటీన్లు మూసేసిన ప్రభుత్వంపై తమ ఆక్రోశం చూపించారు. గత సర్కార్ ఆలస్యంగా అయినా.. అన్న క్యాంటీన్లను ఓ పద్దతి ప్రకారం ప్రారంభించింది. అక్షయపాత్రతో ఒప్పందం చేసుకుని మూడు పూటలా… పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు.
అనూహ్యంగా.. ఈ ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. రోజుకూలీలు…నిరుపేదలకు.. ఇదో వరంలా మారింది. అయితే ప్రభుత్వం మారగానే.. వాటికి మెల్లగా మంగళం పాడేశారు. ముందుగా… అన్న క్యాంటీన్లన్నింటికీ తెలుపు రంగు వేయించారు. పేరు మార్చినా… భోజనం పెడతారు కదా.. అని చాలా మంది అనుకున్నారు. అయితే.. అన్నింటికీ తెల్ల రంగు వేసేసి… క్లోజ్ చేసేశారు. దాంతో.. పేదలు… కొడుకులు తిండి పెట్టని వృద్ధులు.. ఆకలితో అలమటించాల్సి వస్తోంది. ఈ అంశాన్ని టీడీపీ రాజకీయంగా… ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి బాగానే ఉపయోగించుకుంటోంది. పేదల ఫ్రస్ట్రేషన్ ను.. ప్రభుత్వం కూడా.. గుర్తించింది. అందుకే.. అన్న క్యాంటీన్ల మూసివేత తాత్కలికమేనని.. సమగ్ర పరిశీలన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని చెబుతున్నారు.
అయితే.. ఆ పరిశీలన ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై.. ప్రజలకు నమ్మకం కలిగేలా..ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఫలితంగా… ప్రజల్లో నోటి దగ్గర కూడు లాగేసుకున్న భావన ప్రభుత్వంపై ఏర్పడుతోంది. దీన్నే టీడీపీ అనుకూలంగా మల్చుకుంటోంది… ఏదో ఓ పేరు పెట్టి పేదల కడుపు నింపాలని.. కోరుతోంది. ప్రజల నుంచి సానుభూతి పొందుతోంది.