ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి తొలి దశ నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. టీడీపీ టిక్కెట్లను పొత్తుల కోసం త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారు. అన్ని కార్పొరేషన్లు ప్రధానమైనవే కావడంతో.. సీనియర్లకు ఇచ్చారు. అలాగే సామాజిక సమీకరణాలు పాటించారు.జనసేనలో పని చేసిన ముగ్గురు నేతలకూ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కాయి. బీజేపీ నేత లంకా దినకర్కు అవకాశం దక్కింది.
అన్ని కార్పొరేషన్లకు సభ్యులను కూడా నియమించారు. బీజేపీ క్యాడర్.. జనసేన క్యాడర్లో పని చేసిన వారిని గుర్తించి పదవులు ఇచ్చారు. పార్టీ కోసం పని చేసి టిక్కెట్లు త్యాగం చేసిన కర్రోతు బంగార్రాజు, కొనకళ్ల నారాయణ, అబ్దుల్ అజీజ్, రఘురామ కృష్ణరాజు కోసం సీటు త్యాగం చేసిన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన కార్పొరేషన్ పదవులు కేటాయించారు. ప్రకాశం సీనియర్ నేత నూకసాని బాలాజీ, అనకాపల్లి టిక్కెట్ త్యాగం చేసిన పీలా గోవింద్ సత్యనారాయణ, పీతల సుజాత, వజ్జ బాబూరావు వంటి సీనియర్ నేతలకు కీలక పదవులు కేటాయించారు.
బీజేపీ నుంచి లంకా దినకర్కు పదవి ఇచ్చారు. ఈయన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. వైసీపీకి దగ్గరగా ఉండే పలువురు బీజేపీ నేతలు కీలక పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు కానీ.. అలాంటి వారిని ఎంటర్టెయిన్ చేసేందుకు సిద్ధంగా లేమని టీడీపీ సంకేతాలిచ్చినట్లయింది. టీడీపీలో ఇంకా దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి సీనియర్లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వారి సీనియార్టీకి తగ్గ పదవులు ఇవ్వాల్సి ఉంది.