గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.. పెట్టిన మీడియా పోస్టులను .. వాటి లింక్‌లను విడుదల చేశారు. యాసెస్ కాసినో అనే కంపెనీ గుడివాడలో తాము మూడు రోజుల పాటు కేసినో నిర్వహించామని.. సంక్రాంతి పండుగ అయిన పదిహేనో తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇంకా ఆలాగే ఉంది.
వాటిని స్క్రీన్ షాట్లు తీసి టీడీపీ ప్రచారం చేస్దోంది. అలాగే ఈ యాసెస్ కేసినో నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రిమాల్ టోపీవాలా అనే వ్యక్తి పెట్టి సోషల్ మీడియా పోస్టును కూడా టీడీపీ మీడియాకు రిలీజ్ చేసింది. ఆ రెండు వీడియోల్లో చాలా స్పష్టంగా కేసినో నిర్వహిస్తున్నట్లుగా ఉంది. మూడు రోజుల పాటు తాము కేసినో నిర్వహించామని వారు ప్రకటించుకున్నారు. వైసీపీ నేతలు కూడా తాము కేసినో నిర్వహించామని అన్యాపదేశంగా చెబుతున్నారు.
కానీ కొడాలి నాని మాత్రం కేసినో నిర్వహించామని నిరూపించాలంటూ సవాల్ చేశారు. ఈ ఆధారాలతో తాము డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకుంటారన్న నమ్మకం లేదని.. తాము ప్రజాస్వామ్య పద్దతిలో తాము పోరాటం చేస్తామని అంటున్నారు.