తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 34 మందితో రెండో జాబితా ప్రకటించారు. మొదటి జాబితాలో94 మంది ని ప్రకటించారు. ఇప్పటికే 128 మంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇంకా పదహారు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. రెండో జాబితాలో కొంత మంది సీనియర్లు మినహా.. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ చోటు దక్కింది. పల్లా శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాస్.. ఇలాంటి నేతలందరి సీట్లపై పొత్తుల ప్రభావం ఉంటుందనుకున్నారు. అలాగే వలస నేతలు కూడా ఒత్తిడి చేశారు. అయితే చంద్రబాబు మాత్రం వారికే అవకాశాలు కల్పించారు.
గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి వెళ్లి పోటీ చేసేందుకు ఏ విషయం తేల్చకపోవంతో ఆ సీటు పెండింగ్ పెట్టారు. ఆయన భీమిలి కోరుతున్నారు. భిమిలీ సీటుకు కూడా టిక్కెట్ ను ప్రకటించలేదు. ఇక పెందుర్తి సీటులో బండారుకు టిక్కెట్ దక్కడం అనుమానంగానే ఉంది. ఆ సీటు జనసేనకు పోయే అవకాశం ఉంది. అలాగే కళా వెంకట్రావుకు కూడా ఈసారి టిక్కెట్ లభించకపోవచ్చని చెబుతున్నారు. ఆయన సీటును పెండింగ్ పెట్టారు. పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డికే టిక్కెట్ కేటాయించారు.
జాబితాలో ఆరుగురు వారసులకు చోటిచ్చారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టిక్కెట్ ఇచ్చారు. పల్లె రఘునాథరెడ్డి కోడలికి, కందికుంట వెంకట ప్రసాద్ భార్యకు, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తెకు అవకాశం కల్పించారు. పొత్తుల్లో టిక్కెట్ ఇవ్వలేకపోతున్నందుకు సీనియర్లను చంద్రబాబు బుజ్జగించారు. టీడీపీ రెండో జాబితాతో.. షెడ్యూల్ రాక ముందే పదహారు తప్ప అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంతో టీడీపీలో జోష్ కనిపిస్తోంది.