ఓ ఫిర్యాదుదారుని బెదిరించడం చిన్న విషయం కాదు. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేసేందుకు డబ్బులు ఇవ్వడం, బ్లాక్ మెయిల్ చేయడం.. కుటుంబానికి హాని చేస్తామని చెప్పి కేసును విత్ డ్రా చేయించుకోవడం అంటే తెలివి ఉన్న వారు ఎవరూ చేయరు. వంశీ అదే చేసి దొరికిపోయారు.కానీ తాము ఏమీ చేయలేదని బుకాయిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఆ సత్యవర్థన్ అనే వ్యక్తిని వంశీ తీసుకెళ్తున్న దృశ్యాలను విడుదల చేశారు. మైహోంభూజా అపార్టుమెంట్ లిఫ్ట్ నుంచి వంశీతో పాటు సత్యవర్ధన్ ఉన్న వీడియో రిలీజ్ చేశారు.
ఇది ఒక్కటి శాంపిల్ మాత్రమే . న్యాయపరంగా వివాదాలు రాకుండా సాక్ష్యాలు బయటకు రాకుండా ఓ చిన్న క్లిప్ మాత్రమే రిలీజ్ చేశారు. కాల్ రికార్డులు, సత్యవర్ధన్ సీసీ ఫుటేజీ వివరాలు సహా అన్నీ పోలీసుల వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో వంశీ నిండా మునిగారు. తాము బెదిరించలేదని ఎంత చెప్పుకున్నా అవకాశం ఉందు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రభావితం చేయడం తీవ్ర నేరం అవుతుంది. ఇటీవల మోహన్ బాబు తన చేతిలో గాయపడిన జర్నలిస్టును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అది పెద్ద వివాదం అయింది. ఆయన ఫిర్యాదు దారుడును బెదిరించడానికో..త ప్రలోభ పెట్టడానికో వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రశ్నించింది.
ఇప్పుడు కొడాలి నాని వ్యవహారం రసకందాయంలో పడింది. ఆయనపై వరుస కేసులు నమోదు కానున్నాయి. జగన్ మోహన్ రెడ్డి జైలు ముందు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలుగా ఈ ఫుటేజీ రిలీజ్ చేశారు. మెల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. త్వరలో వంశీ కొంత మంది మహిళలతో చేసిన ఆర్థిక లావాదేవీల అంశం బయటకు వస్తుందని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.