తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు. జయలలితపై అక్రమాస్తుల కేసులతో పాటు చాలా లిటిగేషన్ కేసులు ఆయన ప్రముఖులపై కేసులు వేసి ఫలితాలు సాధించారు. చాలా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనను లాయర్ అనుకుంటారు. న్యాయవ్యవస్థతో ఎప్పుడు ఎలా ఆడుకోవాలో ఆయనకు బాగా తెలుసని చెబుతారు. అందుకే జగన్ రెడ్డి కూడా ఆయనకు పిలిచి పెద్ద పీట వేశారు.
టీటీడీ నిధులతో ఆయనకు లాయర్ పోస్టు ఇప్పించారు. లాయర్ కాని వ్యక్తికి లాయర్ పోస్టు ఇవ్వడంతో పాటు అదే హోదాలో టీటీడీ తరపున ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. చట్టంలో ఉన్న ఓ రూల్ ను అడ్డం పెట్టుకుని ఆయన ఈ పిటిషన్ దాఖలు చేసి టీటీడీ సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుపతి టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేసేవారు. కోర్టు ముందు మీడియాతో మాట్లాడుతూ చాలా రాజకీయాలు మాట్లాడేవారు. ఆ కేసులో ఆంధ్రజ్యోతిని కానీ.. ఆర్కేను కానీ ఆయన ఏమీ చేయలేకపోయారు.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో లాయర్ కాని లాయర్ బాధ్యతల నుంచి కూడా వెళ్లగొట్టారు. ఒకప్పుడు ఆయన మాటలకు విలువ ఉండేదేమో కానీ ఇప్పుడు ఆయనను పట్టించుకునేవారు లేరు. ట్రోల్ చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఆయన లాయర్ కాదనే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండి బయట పెట్టి.. తానే ఎదురు పరువు నష్టం దాఖలు చేస్తున్నానని ప్రకటించేసరికి.. సైలెంట్ అయిపోయారు.