టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారంటూ.. సాక్ష్యాలతో సహా బయటపెడతామంటూ.. వీడియోను ప్రదర్శించడంపై.. టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. అదంతా ఎందుకు… సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా ఆని సవాల్ చేసింది. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే.. టీడీపీ నేత బోండా ఉమ మీడియా ముందుకు వచ్చారు. రాజధానిలో వైసీపీ నేతలు కొన్న భూముల వివరాలన్నీ బయట పెట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదు ఎకరాలు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెండు ఎకరాలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఏసురత్నం సహా.. అనేక మంది టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలను బొండా ఉమ బయట పెట్టారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు. వాటి గురించి ఎందుకు .. చెప్పడం లేదని.. వైసీపీని బొండా ఉమ ప్రశ్నించారు. అమరావతిలో భూముల విషయంలో చర్చకు సిద్ధమని.. వైసీపీ కార్యాలయంలోనైనా చర్చకు వస్తామని మీడియా ఎదుటే చర్చిద్దామని బోండా ఉమ సవాల్ చేశారు.
కొవ్వు తలకెక్కిన వైసీపీ నేతలకు కొవ్వు కరిగే రోజులు త్వరలో వస్తాయని బొండా ఉమ హెచ్చరించారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలో.. ఎవరెవరో కొనుగోలుచేసిన భూముల్ని కూడా కలిపేసి. ..వారంతా టీడీపీ నేతల బినామీలని లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ అంటూ పబ్లిక్‌గా ఓపెన్ డాక్యుమెంట్ పెట్టామని గుర్తు చేశారు. నారాయణ కమిటీ రాజధానిని నిర్ణయించిందని మాట్లాడుతున్నారు.. ల్యాండ్‌పూలింగ్ విధివిధానాల కోసమే నారాయణ కమిటీ వేశామని బోండా ఉమ గుర్తు చేశారు. కొన్నాళ్లకిందటి వరకు 25 వేల ఎకరాలు దోపిడీ అన్నారు.. ఇప్పుడు 4 వేల ఎకరాలు అంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినా.. మా పేరే జపం చేస్తున్నారని సెటైర్ వేశారు.
పవన్ కల్యాణ్ పై.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను బొండా ఉమ గట్టిగా డిఫెండ్ చేశారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు.. మీరు జగన్ మోహన్‌రెడ్డి పెంపుడు కుక్కలా అని ఘాటుగా అంబటికి కౌంటర్ ఇచ్చారు బొండా ఉమ. పవన్ కల్యాణ్ పేరెత్తే అర్హత, స్థాయి మీకుందా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పదేపదే పవన్‌నాయుడు అని అంటున్నారని.. మీసం మీద చెయ్యేసి చెబుతున్నా పవన్ నాయుడేనని బొండా ఆవేశంగా స్పందించారు. వైసీపీ నేతలకు వారిపై ఏమైనా డౌట్‌గా ఉంటే వారి డీఎన్ఏలు చెక్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఆరోపణలు కాదు..విచారణలు చేయించాలని… టీడీపీ మొదటి నుంచి సవాల్ చేస్తోంది. అయితే.. వైసీపీ చెప్పిందే చెబుతోంది తప్ప.. విచారణకు వరకూ రావడం లేదు. లోకాయుక్త..సీఐడీ..సీబీఐ పేర్లతోకాలం గడుపుతోంది కానీ.. విచారణకు ఆదేశించి ప్రక్రియ కూడా ప్రారంభించలేదు.