తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు చేశారంటూ సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన మోసాన్ని వివ‌రించారు.

అయితే, దీన్ని మాజీ చైర్మ‌న్లు వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న ఖండించారు. తాను కుటుంబంతో స‌హా శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ప్ర‌మాణం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌గా… ఇది రాజ‌కీయం అంటూ భూమ‌న పాత పాటే పాడారు. తిరుమ‌ల‌ను రాజ‌కీయం కోసం వాడుకోవ‌టం ఒక ఎత్తైతే, నెయ్యిలో క‌ల్తీ చేస్తూ ఇంత‌కు దిగ‌జారుతారా అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది. ఇవి రాజ‌కీయ ఆరోప‌ణ‌లు మాత్ర‌మే అంటూ వైసీపీ కామెంట్ చేసింది.

కానీ ఆ నెయ్యిలో ఉన్న‌వి జంతువుల కొవ్వుతో త‌యారైన ప‌దార్థాల‌ని, ఫిష్ ఆయిల్ తో పాటు మైదా స‌హా ఇంకా ఏం ప‌దార్థాలున్నాయో ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును టీడీపీ బ‌య‌ట‌పెట్టింది. ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజ‌రాత్ కు శాంపిల్స్ పంప‌గా… వ‌చ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాకు చూపించారు.

వెంక‌న్నతో ఆట‌లాడితే శిక్ష త‌ప్ప‌ద‌ని, వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ ఈవో ధ‌ర్మారెడ్డి, భూమ‌న‌, వైఎస్ జ‌గ‌న్ ల‌ను ఉరితీయాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆట‌లాడుకున్నార‌ని మండిప‌డ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close