చంద్రబాబు దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటూ.. టీడీపీ నేతలు… సన్నాయి నొక్కులు ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు దీక్షకు విజయవాడ పోలీసులు కానీ… మున్సిపల్ కమిషనర్ కానీ ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. చంద్రబాబు దీక్ష చేయడానికి వారు అడిగిన మున్సిపల్ స్టేడియాన్ని మాత్రం ఇవ్వలేమని.. టీడీపీ నేతలకు.. అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకంటే… సాధారణంగా ప్రభుత్వ వేదికలను… ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల కోసం ఇవ్వరు. ఆ విషయం.. ఐదేళ్లుగా… పాలకపక్షంగా ఉన్న టీడీపీ నేతలకు తెలియనిది కాదు. కానీ… మీడియాలో అటెన్షన్ కోసమే.. వారు… పోలీసులు, మున్సిపల్ కమిషనర్ల వద్దకు వెళ్లారు.
గతంలో బీజేపీతో కటిఫ్ చెప్పిన సమయంలో… చంద్రబాబు.. తన పుట్టిన రోజునాడు.. ధర్మపోరాట దీక్ష చేశారు. ఆ పోరాట దీక్షను.. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలోనే చేశారు. సెంటిమెంట్‌గా అక్కడే చేస్తామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు కానీ.. అదంతా.. మీడియా షో అనే తేలిపోయింది. ఆ ధర్మపోరాట దీక్షను సీఎం హోదాలో చేశారు. పర్మిషన్ అనే ప్రశ్నే రాదు. కానీ.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పర్మిషన్ ఇస్తారన్న అశ కూడా లేదు. పైగా అప్పుడు చేసిన ధర్మపోరాట దీక్ష ఫలం.. ఏమీ లేదని.. ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి సెంటిమెంట్ కూడా.. లేదు.
14వ తేదీన చంద్రబాబు చేయాలనుకున్న ఇసుక దీక్షను.. విజయవాడలోని ధర్నా చౌక్‌లో చేయాలని ముందుగానే… టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏదో విధంగా అడ్డంకులు సృష్టిస్తోందని… ప్రచారం చేసుకోవడానికి.. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ల వద్దకు వెళ్లి అడిగారు . లేదనిపించుకున్నారు. ఇప్పుడు… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదంతా రాజకీయానికి.. మీడియా అటెన్షన్‌కు పనికి వస్తుందేమోకానీ.. ఎప్పుడూ చేసే రొటీన్ రాజకీయమే. దీని వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదన్న సెటైర్లు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.