వైసీపీ సోషల్ మీడియాకు ఏ విషయంపై స్పందించే అవకాశం ఇవ్వడం లేదు సోషల్ మీడియా. ముందుగా తామే తమ పార్టీపై దాడి చేసేస్తున్నారు. ఎవరి సిద్దాంతాలు వారు అన్వయించి.. ఎప్పుడో నాగబాబు మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అని నిష్ఠూరాలాడుతున్నారు. ఇక పార్టీకి పని చేయబోమని కొంత మంది తీర్మానించేస్తున్నారు. పనిలో పనిగా జనసేనపైనా ఆరోపణలు చేస్తున్నారు.
వీరి తీరు చూసి వైసీపీ సోషల్ మీడియాకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. నాగబాబును తీసుకోవడాన్ని సమర్థించాలా.. వ్యతిరేకించాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ సోషల్ మీడియా వ్యతిరేకిస్తోంది కాబట్టి టీడీపీ, జనసేన మేధ్య చిచ్చు పెట్టాలంటే సపోర్టు చేస్తే బాగుంటుందని కొంత మంది అనుకుంటారు. కానీ అలా సపోర్టు చేస్తే ఎన్నో ఆర్థాలొస్తాయని మరికొందరు గింజుకుంటున్నారు. అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో అన్న మాట పక్కన పెట్టి సొంత పార్టీపైతమ యుద్ధం మాత్రం సోషల్ మీడియా సైనికులు చేసేస్తున్నారు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎలా స్పందించాలో జనసైనికులకూ అర్థం కాని పరిస్థితి కల్పించడం. పార్టీలో చాలా మంది పని చేసిన వాళ్లు ఉన్నా.. వాళ్లను కాదని కుటుంబసభ్యులకు చాన్సిస్తున్నారన్న అసంతృప్తి బయటకు కనిపించకుండా పార్టీ నిర్ణయాన్ని సమర్థించాల్సింది. అసలు ఈ భావనరాకుండా చేయడానికి టీడీపీ సోషల్ మీడియా ఓవరాక్షన్ పనికి వస్తుంది. తమ పార్టీ నిర్ణయాన్ని వారు సమర్థించునే పరిస్థితిని టీడీపీ సోషల్ మీడియా కల్పిస్తోంది.
ఇటీవలి కాలంలో టీడీపీ, కూటమి వైపు నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా.. ముందుగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా చేసి వైసీపీ, జనసేనకు అనే అవకాశం ఇవ్వకుండా రివర్స్ గేమ్ ఆడుతున్నారా అన్న అనుమానాలు కూడా కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి.