వక్ఫ్ బోర్డు చట్టం ఇక ఉమీద్గా మారింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చట్టసవరణకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వ్యతిరేకంగా ఇండియా కూటమి సభ్యులు ఓట్లు వేశారు. ఆ బిల్లును పాస్ చేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. స్పష్టమైన సంఖ్యాబలం ఉంది కాబట్టే బిల్లు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ఆ బిల్లులో ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసేవి ఏమైనా ఉంటే వాటిని తీసేసేలా చూసుకోవాలి. ఈ మేరకు టీడీపీ అలాంటి అభ్యంతకర అంశాలను తప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు సవరణలకు ఆమోదం లభించింది. అదే సమయంలో ఉమీద్ బోర్డులో ఇతర మతస్తులు ఉండటాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంలో తమ విధానం అదేనని టీడీపీ స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు అంశంపై చాలా వివాదాలు ఉన్నాయి. వక్ఫ్ భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు ఉన్నాయి. సరైన రికార్డులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కేలవం ఈ ఒక్క అంశంలోనే చట్టసవరణ చేస్తున్నారు. వారి మత వ్యవహారాలు.. ఇతర విషయాలపై వక్ఫ్ చట్టంలో ఎలాంటి మార్పులు లేవు.
ఇప్పుడు ఈ చట్టం వల్ల పక్కాగా ఆస్తులపై చట్టబద్ధత వస్తుంది. దీనికి సంబంధించి చట్టంలో వెసులుబాట్లు కల్పిచారు. ఇప్పటి వరకూ వక్ఫ్ చట్టం ప్రకారం.. ఎలాంటి పత్రాలు లేకపోయినా పార్లమెంట్ భవనం ఉన్న ప్రాంతాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికే.. ఈ మార్పులు చేశారు. ఎలాంటి ఆస్తికైనా చట్టబద్ధమైన పత్రాలుతో ఉన్నప్పుడే విలువ ఉంటుంది. వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు ఉమీద్ చట్టం ద్వారా అలాంటి చట్టబద్ధత వస్తుంది.