క్రికెటర్ హనుమ విహారీ.. ఓ వైసీపీ చోటా నేత రాజకీయ వేధింపులకు బలి కావడాన్ని టీడీపీ టాస్క్ గా తీసుకుని దేశం దృష్టిలో పెట్టేందుకు ప్రయత్నించింది. టీడీపీ సోషల్ మీడియా ఉదయం నుంచి తాము హనుమ విహారికి అండగా ఉంటామని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. చంద్రబాబు , లోకేష్ కూడా పోస్టులు పెట్టారు. వైసీపీ నేతల ఆకృత్యానికి బలైన హనుమవిహారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు.. వైఎస్ షర్మిల కూడా స్పందించారు. వియ్ స్టాండ్ విత్ హనుమ విహారీ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. హనుమ విహారి క్రికెట్లో సాదించిన విజయాలతో పాటు ఏసీఏలో జరుగుతున్న వ్యవహారాలపైనా ట్వీట్లు చేశారు. విజయసాయిరెడ్డి కబంధహస్తాల్లో ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ అంశం నేషనల్ మీడియాలోనూ వైరల్ అయింది.
ఆంధ్రా క్రికెట్కు ఇక ఆడబోనని హనుమవిహారి ప్రకటించారు. తెలుగు క్రికెటర్ అయిన విహారికి రావాల్సినంత పేరు రాలేదు. ఆంధ్రా క్రికెట్ పెద్దలు.. తమ బంధువులకు.. ఇతరులకు క్రికెట్ జట్లలో సభ్యులకు చోటు కల్పించడానికి ప్రయత్నించడం వల్ల.. అర్హులైన వారు ఆటగాళ్లుగా ఎదగలేకపోతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నా.. టీముల్లోకి రాలేకపోతున్నారు. ఏసీఏ ఈ కారణంగానే భ్రష్టుపట్టిపోతోంది.