తెలంగాణాలో తెదేపా బలం చాలా వేగంగా కుచించుకుపోతోంది. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ మరియు అరికెపూడి గాంధి కూడా తెరాసలో చేరేందుకు నిశ్చయించుకోవడంతో వారిరుని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెదేపా నేతలు చెప్పారు. అయితే దీని గురించి అధికారికంగా ఇంకా ప్రకటన వేలువదవలసి ఉంది. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలోకి వెళ్లిపోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినా ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించిన తరువాత వారితో కలిసి శాసనసభకు వెళ్లినందున ఆయన ఇంకా తెదేపాలోనే ఉన్నారని స్పష్టమవుతోంది.