రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నిషేధిత జాబితాలో చేర్చారు. ఆంధ్రా పార్టీ అంటూ ఆయన చేసిన ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన తన పార్టీని దేశం మొత్తం తీసుకెళ్తానని .. తమ పార్టీలోని తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమతి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అవడానికి గొప్ప అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అక్కడి గ్రామాల్లో… రాష్ట్ర స్థాయిలో ఉన్న బీసీ నాయకులు..బ డుగుల బలహీన వర్గాల నాయకులంతా టీడీపీ నుంచే ఏదిగారు. చివరికి కేసీఆర్ కూడా టీడీపీ నుంచే ఎదిగారు. సరైన నాయకులు ఉంటే… తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుంది. కేసీఆర్ తాను ఏ సెంటిమెంట్‌ను అయితే పెంచి పోషించారో ఆ సెంటిమెంట్ ను తానే పూడ్చిపెట్టారు. ఇంత కాలం చంద్రబాబు యాక్టివ్‌గా తిరిగితే కేసీఆర్ ఎక్కడ సెంటిమెంట్ రెచ్చగొడతారోనన్న చర్చ ఉండేది.
కానీ ఇప్పుడు ఆ ఉద్యమకారుడే.. విశాల దేశ హితం అని బయలుదేరినప్పుడు. టీడీపీ తెలంగాణలో యాక్టివ్ అయితే ఏమీ చేయలేరు. అందుకే తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా మంచి సందర్భం రాదు. యువ నేతల్ని ప్రోత్సహించి.. చంద్రబాబు తరచూ పర్యటనలు చేస్తే.. లేకపోతే..మంచి చరిష్మా ఉన్న నాయకుడికి నాయకత్వాన్ని అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ.. మళ్లీ తెలంగాణలో బలంగా మారుతుంది.