ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి విపరీతమైన ప్రచారం చేస్తుంది. సాక్షి రాసే రాతల్లో జనం నిజాలు ఉంటాయని అనుకోవడం మావేశారు. అందుకే టీవీ చానళ్లలో టాప్ టు చానళ్లను గుప్పిట్లో పెట్టుకున్నారు. అవి చేసిన అతితో జగన్ ఇంకా నష్టపోయారు ఆ విషయం పక్కన పెడితే… ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసే అమెచ్యూర్ కథనాల వల్ల టీడీపీ ఎక్కువ నష్టపోతోంది. ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు ఇంత సిల్లీగా ఎందుకు వ్యవహరిస్తున్నారో టీడీపీ క్యాడర్కూ అర్థం కావడం లేదు.
ఓ వార్డు సచివాలయంలో జగన్ బొమ్మ ఉన్న పత్రాలతో ధృవపత్రం ప్రింట్ చేసి ఇచ్చారు. అది అక్కడ సచివాలయ ఉద్యోగి నిర్లక్ష్యం. రాష్ట్రం అంతా అంతే ఉందన్నట్లుగా ఆ ఒక్క పత్రం పట్టుకుని ఆంధ్రజ్యోతి మెయిన్ స్టోరీ రాసేసింది. నిజానికి జగన్ రెడ్డి వదిలిపోయిన అలాంటి నిర్వాకాలను కడగడం చాలా వరకూ పూర్తయింది. కానీ ఆంధ్రజ్యోతి స్టోరీ వల్ల వైసీపీ హవా ఇంకా ప్రభుత్వంలో ఉందని చెప్పడం ప్రారంభించారు. ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే. ప్రభుత్వం లోని వైసీపీ అధికారులు అంటూ ప్రతి రోజూ.. ఎవరో ఒకరి గురించి రాస్తూనే ఉంటారు. వారంతా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా చేశారు.. ఇలా చేశారని అంటారు. ఆర్థిక శాఖ విషయంలో ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల టీడీపీ సర్కార్ కు …. ఇంకా అధికారుల్లో పట్టుచిక్కలేదని.. అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉందన్న ఓ భావన టీడీపీ వర్గాల్లోకి ఆంధ్రజ్యోతి పంపేస్తోంది. దీని వల్ల ఎవరికి నష్టం.
చివరికి ఏ స్థాయిలో ఈ ప్రచారం ఆంధ్రజ్యోతి చేస్తోందంటే… ఏపీలో రిటైరైన సోమేష్ కుమార్ కు రూల్స్ ప్రకారం… బెనిఫిట్స్ ఇవ్వడంకూడా తప్పే అంటోంది. గుడ్డిగా రూల్స్ ఫాలో కావడం ఏమిటని ప్రశ్నిస్తోంది. మరి అధికారులు ఏం చేస్తారు ?. ఇలాంటి నాన్ మెచ్యూర్డ్ కథనాలతో.. టీడీపీ ప్రభుత్వం… అడ్మినిస్ట్రేషన్ లో వెనుకబడిపోయిందన్న ప్రచారం జరగడానికి ఆంధ్రజ్యోతి కారణం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలాగే నడపాలనుకుంటున్నారు. పార్టీతో కలిపేస్తే జగన్ చేసినట్లే అవుతుంది. అప్పుడు ప్రజలకు ఎవరు భరోసా ?.