కొడాలి నాని నోరు తెరిస్తే లుచ్చా భాష మాట్లాడతారు. ప్రతి పదానికి ముందూ వెనుకా బూతులుంటాయి. ఇలాంటి భాష ఇప్పుడు మెరుగుపడింది. ఓడిన తర్వాత తొలి సారి మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తమపార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని.. వారికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. పోలీసులు కేసులు కూడా తీసుకోవడం లేదని ప్రైవేటు కేసులు వేస్తామని అంటున్నారు.
కొడాలి నాని భాష చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇంత కాలం ఉన్న ఫైర్ ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి భాష మాట్లాడవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ కొడాలి నాని మాత్రం ఎక్కడా మాట దొర్లకుండా.. టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లోకేష్ ప్రస్తావన తీసుకు రాలేదు.
అయితే కొడాలి నాని చేసిందంతా చేసేసి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సుప్పిని, సుద్దపూసలా మాట్లాడితే .. వదిలేస్తారని అనుకోవద్దని.. సరైన ట్రీట్ మెంట్.. సరైన సమయంలో వస్తుందని అంటున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఈ నోటి దురుసు నేతలంతా పెట్టేబేడా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతారన్న చర్చ జరుగుతోంది.