జగన్ రెడ్డి హయాంలో ఇసుకతో చేసిన దోపిడీ కళ్ల ముందు ఉంది. ఇప్పుడు ఇచిత ఇసుక ఇస్తున్నారు. ట్రాన్స్ పోర్టు, పన్నులకే కొంత వసూలు చేస్తున్నారు. గతం కంటే రేటు సగానికి తగ్గిపోయింది. ఇది క్షేత్ర స్థాయిలో నిజం. కానీ సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది ?. ఇసుక తీసి టీడీపీ కళ్లల్లో కొడుతున్నారు వైసీపీ నేతలు. చివరికి బొత్స సత్యనారాయణ కూడా విజయనగరంలో ఇసక రేటు గురించి టీడీపీకి నీతులు చెబుతున్నారు, అక్కడ వైసీపీ హయాంలో ఇసుక ఎంత బంగారం అయిందో ఇప్పుడు ఎలా అందుబాటులోకి వచ్చిందో ప్రజలు కథలుగా చెబుతారు. కానీ బొత్స ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ధైర్యం టీడీపీ సరైన విధంగా కౌంటర్ ఇవ్వలేకపోతూండటమే.
ఇసుకపై సోషల్ మీడియాలో తప్పుడు బిల్లులతో ప్రచారం చేస్తున్నారు. దాన్ని నేతలు మీడియా ముందుకు తెస్తున్నారు. అత్యుత్సాహం నిండి.. ప్రశ్నించడమే మా నైజం అనే భ్రమల్లో ఉండే టీడీపీ సోషల్ మీడియా స్వయం ప్రకటిత మేధావులు ఇది నమ్మేసి… ఇసుకలో ఫెయిల్ అని సొంత పార్టీపై ముద్ర వేసుకుంటూ ఉంటారు. మద్యం విషయంలోనూ అదే జరుగుతోంది. లిక్కర్ దుకాణాలకు అప్లికేషన్లకు ఆహ్వానిస్తే అంచనా వేసినన్ని రాలేదని టీడీపీ నేతలపై నిందలేస్తున్నారు. రింగ్ అయ్యారని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఇతరులు ప్రచారం చేస్తే.. టీడీపీ తిప్పికొట్టేకపోతోంది.
తెలంగాణలో హైదరాబాద్ లాంటి చోట్ల మద్యం దుకాణాల్లో జరిగే వ్యాపారం ఎలాఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి చోట్ల వ్యాపారం కోసం .. రూ. రెండు లక్షలు పెట్టిదరఖాస్తులు పెట్టడంపెద్ద విషయం కాదు. గతంలో ఏపీలో ఘోరమైన మద్యంపాలసీ ఉండటంతో అక్కడి నుంచి కనీసం ఇరవై శాతం అయిన డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో తెలంగాణ మద్యం దుకాణాలకు డిమాండ్ పెరిగింది. కానీ ఏపీలో అలా ఉండదు. అందుకే దుకాణాల కోసం తక్కువ ధరఖాస్తులు వస్తున్నాయి. దీన్ని కూడా టీడీపీ నేతలకు ముడిపెట్టి కొంతమంది వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రచారంతో మొదటికే మోసం వస్తోంది. దాన్నితిప్పికొట్టలేక నిందను భరిస్తోంది టీడీపీ.
రాజకీయాల్లో స్వీయ తప్పిదాలే ఎక్కువ నష్టం చేస్తాయి. ముఖ్యంగా అధికారం చేతుల్లో ఉన్నపార్టీలో. టీడీపీ అలాంటి తప్పులు ఎక్కువ చేస్తుందని అంటారు. ఇప్పుడు కూడా అదే దారిలో ఉందని అనుకోవాలని కొంత మంది సానుభూతిపరులు మధనపడాల్సి వస్తోంది.