హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు ఈనెల 3నజరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిన్న జరిగింది. కర్నూలు, ప్రకాశం జిల్లాలలో ఎన్నికలు జరిగిన రెండుచోట్లా టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. స్థానిక సంస్థలలో జగన్ పార్టీకి బలం ఎక్కువ ఉన్నా చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపించాయని చక్రపాణిరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రకాశంజిల్లాలో ఈ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.