జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై అందరూ అనుకుంటున్నారంటూ.. పదుల కొద్దీ అవినీతి ఆరోపణలు చేశారు. కానీ టీడీపీ నేతలు రాజకీయంగానే విమర్శలు చేశారు. ఎప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా ఒక్కసారి కూడా విమర్శించలేదు. ఆధారాలు చూపించాలని మాత్రమే డిమాండ్ చేసేవారు. లంచాలకు రసీదులుంటాయా అని విచితర వాదనతో పవన్ తప్పించుకున్నా.. టీడీపీ నేతలు ఆవేశపడలేదు.
టీడీపీ ఎమ్మెల్యేలయితే.. పవన్ కల్యాణ్ చేసే ఆరోపణలకు తీవ్ర మనస్థాపానికి గురయ్యేవారు. లీగల్ యాక్షన్స్ కు సిద్దపడ్డారు కానీ.. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయాలనుకోలేదు. జగన్ చేసిన వ్యాఖ్యలపై.. పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వ్యక్తిగత అంశాలపై ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ అంశం వారూ వారూ తేల్చుకోవాల్సినదని స్పష్టం చేశారు. ఇదీ ఆ పార్టీ విధానం.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాత్రం పవన్ కల్యాణ్ చేసిన ఒక్క రాజకీయ విమర్శను సహించలేకపోయారు. ఆయన విమర్శించడాన్ని ఖర్మగా చెప్పుకున్నారు. నైతిక ప్రవర్తన సరిగ్గా లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సి రావడం దౌర్భాగ్యమంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ అత్యంత హీనమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పవన్ కల్యాణ్ చేసిన రాజకీయ విమర్శలో ఎలాంటి తప్పూ లేదు. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వైసీపీపై ఉంది. కానీ దానికి కౌంటర్ గా పవన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని జగన్ అనుకున్నారు. ఇదీ వైసీపీ విధానం.
తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత సఖ్యంగా ఉన్నప్పుడు… చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజా సమస్యలపై తనను కలవడానికి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కు స్వయంగా స్వాగతం పలికేవారు. వెళ్లేటప్పుడు కారు వద్దకు వెళ్లి సాగనంపేవారు. పవన్ చెప్పిన సమస్యలపై అఫ్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేవారు. లోకేష్, చంద్రబాబులపై జనసేన అధినేత పవన్ అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత కూడా టీడీపీ విధానంలో మార్పు రాలేదు. అదే రాజకీయ పరమైన ఓ చిన్న విమర్శ చేస్తేనే జగన్ తట్టుకోలేకపోయారు. పవన్ ను కించపరిచారు. ఇలాంటి మనస్థత్వం ఉన్న జగన్ జగన్ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశానికి, వైసీపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని, చంద్రబాబు రాజకీయ పరిపక్వత , సీనియారిటీ ఏమిటో ఇఫ్పటికైనా పవన్ కళ్యాణా్ తెలుసుకోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.