ఉల్లి ధరలు పెరిగిపోయినా… ప్రభుత్వం నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతోందని… తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఆందోళన చేసింది. ఉల్లి దండలను ..మెడలో వేసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై చర్చించాలని… అసంబ్లీలో ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు పట్టుబట్టారు. అయితే.. దీనిపై సభలో.. ముఖ్యమంత్రి స్పందించారు. బయట మంత్రి మోపిదేవి సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని సీఎం జగన్ విమర్శించారు. ఇక్కడకు వచ్చి… పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి మోపిదేవి.. తర్వాత విడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. హెరిటేజ్‌లో రూ. 130 కి కేజీ ఉల్లి అమ్ముతున్నారని.. చంద్రబాబుకు .. ప్రజలపై అంత ప్రేమ ఉంటే.. తక్కువకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.
మీడియా పాయింట్లో మాట్లాడిన.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. హెరిటేజ్‌లో ఉల్లిపాయ రేట్లను చూసే… టీడీపీ నిత్యావసర ధరలపై చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు. తాము ప్రజలకు రూ. 25కే ఉల్లి అందిస్తూంటే.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలు.. ఇప్పుడు.. చంద్రబాబు కుటుంబానికి చెందిన చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందినవి కావు. వాటిని… రెండు, మూడేళ్ల క్రితమే.. బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ లాంటి దుకాణాల సముదాయం ఓనర్ అయిన.. కిషోర్ బియానీకి చెందిన ప్యూచర్ రిటైల్ అనే కంపెనీకి అమ్మేశారు.
వంద శాతం.. వాటాను.. అమ్మేసినట్లు అప్పుడే ప్రకటించారు. ఈ వాటాల అమ్మకంపై.. జగన్ తో పాటు.. రోజా లాంటి నేతలు విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ.. ఇప్పటికీ.. హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబు కుటుంబానిదేనని..అందులో ధరలు ఎక్కువ ఉన్నాయన్నట్లుగా.. అసెంబ్లీలోనూ బయట విమర్శలు చేస్తూ.. రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు.