అన్న ఎన్టీఆర్ తన సినీ జీవితంలో సాధించాల్సినదంతా సాధించాను ఇక తనను ఆ స్థాయికి తీసుకు వచ్చిన ప్రజల కోసం ఏదైనా చేయాలని అనుకున్న ఆలోచన నుంచి పుట్టిందే తెలుగుదేశం. ఏదైనా ఓ పని అనుకుంటే దాన్ని యజ్ఞంలా పూర్తి చేయడమే ఎన్టీఆర్ కు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ప్రారంభించాలని అనుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలను అలాగే పూర్తి చేశారు. మార్చి 29, 1982న హైదరాబాద్‌లో పార్టీని ప్రకటించారు. ఇప్పటికి నలభై మూడేళ్లు నిండాయి కానీ.. ఎన్టీఆర్ ఆనాడు ఎగరేసిన జెండా ఇప్పటికీ సగర్వంగా ఎగురుతూనే ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడింది.
పేదల్ని పైకి తేవడమే టీడీపీ లక్ష్యం
తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు ఓ భరోసా. కడుపు నిండా తిండికి…కట్టుకోవడానికి గుడ్డకి.. ఉండటానికి ఇంటికి చింత పడాల్సిన అవసరం లేనంత ధైర్యం పేదలకు ఇచ్చిన పార్టీ. నాడు రెండు రూపాయలకు కిలో బియ్యం.. పథకం ఇప్పటికీ కొనసాగుతుందంటే టీడీపీ ముద్ర ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మద్రాసీలు అనే ముద్ర ఉన్న తెలుగువారిని.. మద్రాసీలు కాదు..తెలుగు వారు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేయాలనేది ఎన్టీఆర్ తపన. ఆ విషయంలో ఆయన అడుగుజాడల్లో పార్టీని నడుపుతూ చంద్రబాబు.. తెలుగువారంటే ..తెలుగు వారే అన్న అభిప్రాయాన్ని తీసుకువచ్చారు.
సమాజంలో సామాజిక న్యాయం తెచ్చిన పార్టీ టీడీపీ
పేదలకు సంక్షేమం కాదు.. వారిని ఆర్థికంగా, సామాజికంగా కూడా పైకి తీసుకువచ్చే విధానాలను టీడీపీ పాటిస్తుంది. ఈ రోజు రాజకీయాల్లో బీసీ నాయకత్వం బలంగా ఉందంటే దానికి కారణం టీడీపీ. టీడీపీ ఆవిర్భావంతో ఎంతో మంది బీసీ నాయకులు తెరపైకి వచ్చారు. బలంగా నిలబడ్డారు. అలా అలా వారి ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలనూ టీడీపీ సమాజంలో పైకి తీసుకు రావాలనుకునే చర్యలు చేపట్టింది. ఇతర పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు. ఎదుగూ బొదుగూ లేకుండా చేసే ప్రణాళికలు అమలు చేశాయి. టీడీపీ సంక్షేమం ఎంత ముద్ర వేసిందో.. ప్రజల్ని ఆర్థికంగా బలపరిచేలా అనేక చర్యలు చేపట్టడం ద్వారా పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. ఆ పయనం ఇంకా కొనసాగుతోంది.
ప్రజల్ని విభజించకుండా.. అభివృద్ధి ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ
తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్యాన్ని వంద శాతం సాధించడానికి ..ఎప్పుడూ సరైన దారిలోనే వెళ్తోంది. పార్టీ ఉనికికి ముప్పు వచ్చేలా అనేక ఘటనలు జరిగినప్పుడు ఇతర పార్టీల్లా కుల, మత, ప్రాంత రాజకీయాలను చేసి ప్రజల్ని రెచ్చగొట్టి పార్టీని కాపాడుకుందామన్న ఆలోచనలు వచ్చినప్పటికీ నాయకత్వం ప్రజలపై నమ్మకంతో వాటి జోలికి పోలేదు. ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజా సంక్షేమం.. ప్రజాభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తుంది. అదే పార్టీ వ్యవస్థాపకుడు.. మహనీయుడు ఎన్టీఆర్‌కు ఇచ్చే అసలైన గౌరవం.
పార్టీకి ఇంకా దశాబ్దాల భవిష్యత్‌కు గ్యారంటీ ఇస్తున్న యువనాయకత్వం
ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ ఓ మేరు శిఖరం. తెలుగువారి జీవితాలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే మార్గంలో టీడీపీకి మరెంతో భవిష్యత్ ఉందని యువనాయకత్వం నిరూపిస్తోంది. ఇప్పటికే పార్టీలో కొత్తతరం తనదైన ముద్ర వేస్తోంది. ఇది యువతరాన్ని టీడీపీకి మరింతగా దగ్గర చేస్తోంది.