సాధారణంగా పోలీసులు ఓ కేసు నమోదు చేయాలంటే… అసలు నేరం ఎప్పుడు జరిగింది..? ఎలా జరిగింది..? ప్రాథమిక సాక్ష్యాధారాలేంటి..? అన్ని చూసుకున్న తర్వాత కేసు నమోదు చేయాలి. కానీ కోడెల విషయంలో పోలీసులు ఏమీ చూసుకోలేదు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై… ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం మూడు నెలల్లో 19 కేసులు నమోదు చేసింది. కోడెల కుమారుడు, కుమార్తెల పేరునూ ఈ కేసుల్లోకి లాగారు. అయితే ఈ కేసుల్లో.. ఒక్కటంటే… ఒక్కదానికీ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. తమకు పైనుంచి ఆదేశాలొచ్చినట్లుగా… కేసులు నమోదు చేస్తూ పోయారు. ఫిర్యాదు చేసేవారిలో చీటింగ్ కేసుల్లో ఉన్న వాళ్లు ఉన్నారని పోలీసులకు తెలియక కాదు. కావాలనే చేశారు. చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలోనూ అదే చేశారు. దీనికి సంబంధించిన వివరాలతో టీడీపీ ఓ నోట్ విడుదల చేసింది.
పోలీసులు పెట్టిన ఫాల్స్ కేసులు..!
తనను తాను రంజీ ప్లేయర్ గా చెప్పుకుని… ఎమ్మెస్కే పేరు సైతం వాడుకుని మోసాలకు పాల్పడిన నాగారాజు సీరియల్ చీటర్ కోడెలపై ఏ మాత్రం ఆధారాలు లేకుండా… ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టారు. అంతే కాదు.. దానికి సాక్షి మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కూడా.. ఈ నాగరాజు.. ఓ చీటింగ్ కేసులో.. నెల్లూరు పోలీసులకు చిక్కాడు.
కందుకూరి బుచ్చివెంకాయమ్మ అనే మహిళ కూడా.. కోడెలపై ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఏమిటంటే.. ఆమె సమీప బంధవులు… వారసత్వ ఆస్తిగా వచ్చిన తన కుమారుడి పొలాన్ని అమ్మేశారని..దానికి కోడెల మద్దతిచ్చారనేది ఫిర్యాదు. ఈ కేసులో అటు వెంకాయమ్మ ఫిర్యాదు చేయగానే.. ఇటు పోలీసులు కోడెల కుమార్తె, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది అయితే సివిల్ కేసు అవ్వాలి. అది కూడా.. ఆ వెంకాయమ్మ కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ కోడెల కుటుంబీకుల్ని ఇందులోకి లాగి కేసు పెట్టారు.
అలాగే రవి అనే వ్యక్తి…కోడెల శివరాం తనను కులం పేరుతో దూషించారని కేసు పెట్టారు. ఆ ఘటన జరిగిన సమయం అంటూ చెప్పిన సమయంలో.. శివరాం.. విదేశాల్లో ఉన్నారు.
ఇక ఫర్నీచర్ కేసు విషయంలో… అచ్చంగా కోడెల పరువు తీయడానికే ప్రయత్నం చేశారు. ఆయన ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోని అసెంబ్లీ సిబ్బంది.. నర్సరావు పేట ఎమ్మల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించిన లేఖలన్నీ…ఇప్పుడు బయటకు వచ్చాయి.
కులం ఒకటే అయితే కోడెల తప్పే…!
కోడెల వ్యక్తిత్వాన్ని అత్యంత దారుణంగా.. సాక్షి మీడియా.. విజయసాయిరెడ్డి… కించ పరిచే ప్రయత్నం చేశారు. నాగార్జున యూనివర్శిటీలో ఏసీబీ దాడుల్లో దొరికిన ఓ ఉద్యోగికి.. కోడెలకూ లింక్ పెట్టేశారు. కోడెల ప్రోత్సాహంతోనే ఆయన అవినీతికి పాల్పడ్డారని సాక్షిలో రాసుకొచ్చారు. ఆ ఉద్యోగి కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, నర్సరావుపేట నియోజకవర్గానికి చెందిన వారని.. కోడెలకు లింక్ పెట్టేసి కథనాలు రాశారు.
డీజీపీ సైతం ఎందుకు చేతులెత్తేశారు..?
ఇక విజయసాయిరెడ్డి అయితే.. కోడెలను టార్గెట్ చేయని రోజు లేదు. కోడెల సంగతి తేలుస్తామని ఆయన పదకొండు ట్వీట్లు పెట్టారు. కోడెల పై కేసు పెట్టే వారికి అండగా ఉంటామని.. ఏదో ఓ లబ్ది చేకూరుస్తామన్నట్లుగా ఆశలు కల్పించారు. ప్రత్యేకంగా కోడెలపై కేసులు పెట్టే విషయాన్ని ఆయనే ప్రత్యక్షంగా చూసుకున్నారని… టీడీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. తనపై పెడుతున్న కేసుల విషయంలో… కోడెల శివప్రసాదరావు ఓ సారి నేరుగా డీజీపీని సంప్రదిస్తే… తన చేతుల్లో ఏమీ లేదని.. నేరుగా విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారని సమాధానం ఇచ్చారట. కోడెలపై ఇలా చేసిన కుట్రలు, కేసులతోనే… ఆయన మానసిక స్థైర్యం కోల్పోయారు. చివరికి ప్రాణం తీసుకున్నారు.
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2019/09/document-compressed.pdf”]